ప్రపంచపటం మారబోతోంది !! ఇకపై ఖండాలు ఏడు కాదు.. ఎనిమిది..

Phani CH

Phani CH |

Updated on: Mar 21, 2023 | 9:04 PM

ప్రపంచపటం మారబోతోంది.. భవిష్యత్తులో ఖండాలు ఏడు కాదు ఎనిమిది అని చెప్పే సమయం రాబోతోంది... అవును ఆఫ్రికా ఖండం రెండుగా చీలబోతోంది.

ప్రపంచపటం మారబోతోంది.. భవిష్యత్తులో ఖండాలు ఏడు కాదు ఎనిమిది అని చెప్పే సమయం రాబోతోంది… అవును ఆఫ్రికా ఖండం రెండుగా చీలబోతోంది. ఈ విషం ఎన్నో ఏళ్లుగా శాస్త్రవేత్తలు, భూగర్భ నిపుణులు అంటున్నమాట. ఆఫ్రికా ఖండం రెండుగా చీలి, ఆ చీలిక మధ్యలో సరికొత్త సముద్రం ఏర్పడబోతోందని, అందుకు భూమి లోపలా, బయటాకూడా సంకేతాలు మొదలైపోయాయని భూగర్భ నిపుణులు అంటున్నారు. భూభాగం విషయంలో నిరంతరం మార్పులు జరుగుతూనే ఉంటాయి. అయితే ఈ మార్పులు అప్పటికప్పుడు కనిపించేవి కాదు. కొన్ని వేల సంవత్సరాలుగా ఈ మార్పులు జరుగుతుంటాయి. తాజాగా అలాంటి భారీ మార్పే ఆఫ్రికా ఖండంలో జరగబోతోంది. ఆఫ్రికా రెండుగా చీలి, కొత్తఖండం ఏర్పడబోతోంది. ఈ చీలికలో భాగంగా వీటి మధ్య కొత్త సముద్రం కూడా ఆవిర్భవించే అవకాశాలున్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ మార్పును తూర్పు ఆఫ్రికా చీలికగా పేర్కొంటున్నారు. భూగర్భంలో ఉండే టెక్టానిక్‌ ప్లేట్‌ అనే ఒక పలక భాగం రెండుగా విడిపోవడాన్ని శాస్త్రవేత్తలు చీలికగా చెబుతారు. ఈ పలకలు కదిలినప్పుడు భూమిపైనా, భూమిలోపలా లోయల్లాంటి పగుళ్లు ఏర్పడతాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బెంగళూరు లో వింత ఘటన.. దంపతుల మధ్య చిచ్చుపెట్టిన నిద్ర..

సీరియల్ కిల్లర్ కాదు కిస్సర్ !! ఆంటీలను చూస్తే అర క్షణం కూడా ఆగడు

మూడేళ్ల పాప బొమ్మ తుపాకీ అనుకుని ఆడుకుంటుండగా పేలిన గన్ !! సీన్ కట్ చేస్తే ??

పెళ్లి వేదికపై వధువు చేసిన పనికి అంతా అవాక్కు.. వరుడు మాత్రం ఏంచేశాడో తెలుసా ??

ఇది చెస్‌ బోర్డ్ అనుకునేరు.. అసలు విషయం తెలిస్తే షాకవుతారు

 

Follow us

Click on your DTH Provider to Add TV9 Telugu