ఇది చెస్ బోర్డ్ అనుకునేరు.. అసలు విషయం తెలిస్తే షాకవుతారు
కళలకు కేరాఫ్ అడ్రస్ భారతదేశం. ఇక్కడ ప్రతి అంశంలోనూ కళాత్మకత నిండి ఉంటుంది. అందుకు ఉదాహరణ ఈ వీడియో. ఈ వీడియోలో కనిపిస్తున్నది చూసి ఇందులో ఏముంది..
కళలకు కేరాఫ్ అడ్రస్ భారతదేశం. ఇక్కడ ప్రతి అంశంలోనూ కళాత్మకత నిండి ఉంటుంది. అందుకు ఉదాహరణ ఈ వీడియో. ఈ వీడియోలో కనిపిస్తున్నది చూసి ఇందులో ఏముంది.. చెస్ బోర్డే కదా అనిపిస్తుంది. కానీ అదొక రైల్వే స్టేషన్. అచ్చం చెస్‌బోర్డ్‌లా కనిపించే ఆ రైల్వే స్టేషన్ ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ఉంది. దీని నిర్మాణ శైలి ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. చారిత్రక కట్టడాల్లో ఒకటిగా నిలిచిన ఈ రైల్వే స్టేషన్ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ రైల్వేస్టేషన్ విశిష్టతను తెలుపుతూ ఇండియన్ రైల్వే ట్విట్టర్‌లో షేర్ చేసింది. అద్భుతమైన ఆర్కిటెక్చర్ తో పై నుంచి చూస్తే చెస్ బోర్డ్ మాదిరిగా కనిపిస్తుంది’’ అంటూ రైల్వే శాఖ ట్విట్టర్‌లో తెలిపింది. స్టేషన్ డోమ్స్, పిల్లర్లు చెస్ పీసులు మాదిరిగా ఉంటాయని, ఎంతో వినూత్నమైన నిర్మాణ శైలితో ఉండే ఈ రైల్వే స్టేషన్ సందర్శకులను కట్టిపడేస్తుందని తెలిపారు. రైల్వే శాఖ చేసిన ఈ ట్వీట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘‘టూరిస్టులను పైకి తీసుకెళ్లి చూపిస్తారా? నేలపై నుంచి చూస్తే ఏమీ కనిపించదు’’ అని ఓ యూజర్ అంటే, ఈ ఆర్కిటెక్చర్ అద్భుతాన్ని తప్పనిసరిగా ఒక్కసారైనా చూడాలని మరో యూజర్ పేర్కొన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Suriya: అనుకున్నట్టే జరిగింది !! ముంబైలో సూర్య కొత్త ఇల్లు !! వేరే కాపురం మొదలైందిగా
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

