అమ్మకానికి అత్యంత ఖరీదైన దీవి.. రియల్ ఎస్టేట్ డీల్ లో కేవలం రూ.1,800 కోట్లే

అమ్మకానికి అత్యంత ఖరీదైన దీవి.. రియల్ ఎస్టేట్ డీల్ లో కేవలం రూ.1,800 కోట్లే

Phani CH

|

Updated on: Mar 30, 2023 | 9:02 PM

అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ అద్భుతమైన దీవిని అమ్మకానికి పెట్టారు. పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల యాజమాన్యం నిర్వహిస్తున్న ఈ దీవి 21 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.

అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ అద్భుతమైన దీవిని అమ్మకానికి పెట్టారు. పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల యాజమాన్యం నిర్వహిస్తున్న ఈ దీవి 21 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. 2021లో దీనిని రియల్‌ ఎస్టేట్ డెవలపర్‌ టాడ్‌ మైకేల్‌ గ్లాసర్‌ 85 మిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేశారు. ఇప్పడు దీని విలువ మూడింతలైంది. ప్రస్తుతం దీని ధర 218 మిలియన్‌ డాలర్లు పలుకుతోంది. ఇండియన్‌ కరెన్సీలో ఈ దీవి ధర 1800 కోట్ల రూపాయలన్నమాట. ఇది ఫ్లోరిడా పామ్‌ బీచ్‌ కంట్రీలో ఉంది. దీనికి 10 టార్పన్‌ ఐజిల్‌ అని పేరు పెట్టారు. ఇందులో 9 వేల చదరపు అడుగుల పరిధిలో విశాలమైన ఇంటిని నిర్మించారు. గెస్ట్‌ హౌస్‌, టెన్నిస్‌ కోర్ట్‌, 98 అడుగుల స్విమ్మింగ్‌పూల్‌ కూడా ఉన్నాయి. ఎవరైనా దీనిని ప్రస్తుతం పలుకుతున్న ధరకు కొనుగోలు చేస్తే ఫోరిడాలోనే అత్యంత ఖరీదైన రియల్‌ ఎస్టేట్‌ డీల్‌గా ఇది రికార్డుకెక్కనున్నది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హాస్పిటల్‌లో హోమం.. పరేషానైన ప్రజానీకం

నోరూరించే చాకోలెట్స్.. కేక్స్ అనుకుని తినేరు.. అవేంటో తెలిస్తే షాక్ అవుతారు

అశ్లీల వీడియోలు పంపినందుకు.. 188 నెలల జైలు !!

Published on: Mar 30, 2023 09:02 PM