నోరూరించే చాకోలెట్స్.. కేక్స్ అనుకుని తినేరు.. అవేంటో తెలిస్తే షాక్ అవుతారు
రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు చెందిన జులియా పొపొవా తయారుచేసే సబ్బులు అచ్చం పిజ్జా, బర్గర్, టెడ్డీబేర్, పండ్లు, మద్యం సీసాలు, చేపలు, నాణేలు ఇలా విభిన్న ఆకారాల్లో దర్శనమిస్తాయి.
రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు చెందిన జులియా పొపొవా తయారుచేసే సబ్బులు అచ్చం పిజ్జా, బర్గర్, టెడ్డీబేర్, పండ్లు, మద్యం సీసాలు, చేపలు, నాణేలు ఇలా విభిన్న ఆకారాల్లో దర్శనమిస్తాయి. నోరూరించే ఆహార పదార్థాల్లా కనిపించే ఈ సబ్బులను తినడానికి ప్రయత్నించి కంగుతిన్న వారు ఎంతోమంది ఉన్నారు. యూనివర్సిటీలో చదివే రోజుల్లో సబ్బులను విభిన్న ఆకారాల్లోకి మార్చాలనే ఆలోచన ఈమెకు వచ్చింది. వెను వెంటనే మార్కెట్లో లభించే సబ్బులు కొని, వాటిని కరిగించి ఏ రూపంలోకి మారిస్తే బాగుంటుందని ఆలోచించింది. ఎదురుగా ఓ గుర్రంబొమ్మ కనపడటంతో సిలికాన్‌ను ఉపయోగించి ప్రయత్నించింది. ఆ బొమ్మ చాలా బాగా రావడంతో జులియాను బంధువులు, స్నేహితులు ప్రోత్సహించారు. ఉద్యోగానికి రాజీనామా చేసి, విభిన్న ఆకారాల్లో సబ్బులు తయారుచేసి స్థానిక మార్కెట్లో విక్రయించడం మొదలుపెట్టింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: