దుబాయ్‌లో తెలుగోడికి రూ. 2.25 కోట్ల క్యాష్‌ ప్రైజ్‌

దుబాయ్‌లో తెలుగోడికి రూ. 2.25 కోట్ల క్యాష్‌ ప్రైజ్‌

Phani CH

|

Updated on: Jun 29, 2024 | 12:13 PM

ఉపాధి కోసం యూఏఈ లోని దుబాయ్‌ కు వెళ్లిన ఓ తెలుగు వ్యక్తిని అదృష్టం వరించింది. నెల నెలా తాను చేసిన పొదుపుతో ఏకంగా 2.25 కోట్ల రూపాయలు గెలుచుకున్నారు. సేవింగ్స్‌ స్కీమ్‌ చందాదారులకు లక్కీ డ్రా నిర్వహించగా.. అందులో అతడు విజేతగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన బోరుగడ్డ నాగేంద్రమ్‌ 2017లో యూఏఈ వెళ్లారు. దుబాయ్‌ లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న ఆయన

ఉపాధి కోసం యూఏఈ లోని దుబాయ్‌ కు వెళ్లిన ఓ తెలుగు వ్యక్తిని అదృష్టం వరించింది. నెల నెలా తాను చేసిన పొదుపుతో ఏకంగా 2.25 కోట్ల రూపాయలు గెలుచుకున్నారు. సేవింగ్స్‌ స్కీమ్‌ చందాదారులకు లక్కీ డ్రా నిర్వహించగా.. అందులో అతడు విజేతగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన బోరుగడ్డ నాగేంద్రమ్‌ 2017లో యూఏఈ వెళ్లారు. దుబాయ్‌ లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న ఆయన 2019 నుంచి తాను సంపాదించిన దాంట్లో నుంచి ప్రతీ నెలా 100 యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ దర్హమ్స్‌ను నేషనల్‌ బాండ్స్‌లో పొదుపు చేశారు. ఈ సేవింగ్ స్కీమ్‌ కట్టేవారికి రివార్డు ప్రోగ్రామ్‌ కింద లక్కీ డ్రా తీస్తారు. గ్రాండ్‌ ప్రైజ్‌ కేటగిరీలో తీసిన లాటరీలో నాగేంద్రమ్‌ విజేతగా నిలిచారు. నగదు బహుమతి కింద 1 మిలియన్‌ యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ దర్హమ్స్‌ అందుకున్నారు. అంటే భారత కరెన్సీలో దాదాపు 2.25 కోట్ల రూపాయలకు పైమాటే. ఈ ప్రైజ్‌మనీపై ఆంధ్రా వాసి నాగేంద్రమ్ అంతులేని ఆనందం వ్యక్తం చేశారు. తన పిల్లల ఉన్నత చదువుల కల నెరవేరుతుందని, వారి భవిష్యత్తు భద్రంగా ఉంటుందని సంతోషపడ్డారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ భవనాలు కూడా కూల్చేస్తాం.. వైసీపీ ఆఫీసులకు నోటీసులు

IT Jobs: ఐటీ ఉద్యోగుల్లో టెన్షన్ టెన్షన్.. అసలు ఏం జరుగుతుంది ??

TOP 9 ET News: పవన్ డిప్యూటీ cm అయిన వేళ యూత్‌కు చిరు సందేశం

20వ అంతస్తు గ్రిల్స్‌ మధ్య ఇరుక్కున్న పిల్లి !!

వెరైటీ దొంగలు.. ఏం దోచుకెళ్లారో తెలిస్తే నవ్వు ఆపుకోలేరు