తాగి నడిపినందుకు తిక్క కుదిరింది !! ఈసారి కోర్టు ఏం శిక్ష వేసిందంటే ??
మద్యం మత్తులో వాహనాలు నడుపొద్దని పోలీసులు ఎన్ని విధాలుగా చెప్పినా.. వాహనదారుల తీరు మారడంలేదు. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడి జైలుకెళ్ళొచ్చినా బుద్ధి మారడంలేదు. ఓ ఆటోడ్రైవర్ డ్రైవ్‌లో పట్టుబడి మూడు రోజులు జైలుకెళ్లాడు.
మద్యం మత్తులో వాహనాలు నడుపొద్దని పోలీసులు ఎన్ని విధాలుగా చెప్పినా.. వాహనదారుల తీరు మారడంలేదు. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడి జైలుకెళ్ళొచ్చినా బుద్ధి మారడంలేదు. ఓ ఆటోడ్రైవర్ డ్రైవ్‌లో పట్టుబడి మూడు రోజులు జైలుకెళ్లాడు. అయినా తీరు మార్చుకోకుండా మళ్లీ మద్యం తాగి ఆటో నడుపుతూ పోలీసులకు చిక్కాడు. దీంతో కోపమొచ్చిన న్యాయమూర్తి తగిన రీతిలో బుద్ది చెప్పారు. బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు మార్చి 12న డ్రంకెన్ డ్రైవ్‌లో భాగంగా వాహనాలు తనిఖీ చేపట్టారు. ఆసిఫ్‌నగర్‌కు చెందిన వెంకటరమణ మద్యం మత్తులో ఆటో నడుపుతూ దొరికాడు. అతనికి బ్రీతి ఎనలైజ్ చేయగా.. 339 బీఏసీ వచ్చింది. గతేడాది ఆగస్టులో కూడా డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడి మూడు రోజులు జైలుకు వెళ్లి వచ్చాడు. అయినా, తీరు మార్చుకోకుండా మరోసారి డ్రంకెన్ డ్రైవ్ చేస్తూ దొరకడంతో పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. దీంతో అగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి.. అతనికి జైలు శిక్షతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేశారు. అంతేకాదు.. 2,100 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నిద్రపోతున్న ఏనుగుల గుంపుని చూశారా ??
ఊపిరాడక ఉక్కిరిబిక్కిరైన చిన్నారి.. టెస్ట్ చేసి డాక్టర్లు షాక్ !!
సమాధుల్లో దొరికిన బంగారు నెక్లెస్‌లు.. మరింత లోతుగా తవ్వగా !!
మెట్రోలో చెప్పులతో కొట్టుకున్న మహిళలు !! నెట్టింట వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో
అరెరె.. మార్కెట్లో ఫైటింగ్ ఏంది గురూ !! మరీ ఇంతలా కొట్టుకోవాలా ??