ప్రేమతో కూతురును చూడ్డానికి వెళితే.. మెడలో ఉన్నది కాస్తా కొట్టేశారు
హైదరాబాద్ మహానగరంలో చైన్‌స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఒంటరి మహిళలే లక్ష్యంగా చేసుకుని మెడలో ఉన్న బంగారు గొలుసులు తెంపుకెళుతున్నారు. పోలీసులు పట్టుకుని జైళ్లకు పంపించినా దొంగతనాలు మాత్రం మానడం లేదు. తాజాగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ కలకలం రేపింది.
మల్లయ్య టవర్ వద్ద నిర్మల అనే వృద్ధురాలు రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న సమయంలో ఆమె మెడలోని బంగారు గొలుసు తెంపుకెళ్లారు. యాక్టివా బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలో నుండి ఆరు తులాల బంగారు చైన్‌ను ఎత్తుకెళ్లిపోయారు. నిర్మల సొంత ఊరు మహబూబ్‌నగర్ జిల్లా బెబ్బెర్ల గ్రామం. అత్తాపూర్ సమీపంలో ఉన్న తన కూతురును చూడ్డానికి నగరానికి వచ్చింది. తన సొంతూరుకు తిరిగి వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు చూసి వెంటనే అత్తాపూర్ పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటన స్థలానికి చేసుకున్న పోలీసులు వృద్దురాలి స్టేట్‌మెంట్ రికార్డ్ చేసుకుని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అక్కడ ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అలాగే చైన్ స్నాచర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానితులు కనిపిస్తే సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చిన్నారి చేతిరాత బాగోలేదని.. ట్యూషన్ టీచర్ దారుణం..
పడగ విప్పిన పాముతో డాన్స్ ఏంట్రా అయ్యా.. ఆలా చేస్తే ఇలానే అవుతుంది మరి
ముచ్చటగా 8 పెళ్లిళ్లు.. తొమ్మిదో పెళ్లికి సిద్ధమైన మహిళకు ఊహించని షాక్
30 ఏళ్లనాటి పిండం.. ఇప్పుడు శిశువుగా జననం
బిగ్ అలర్ట్.. ఇప్పుడే జాగ్రత్త పడకపోతే మూడిందే.. తరువాత ఎంత ఏడ్చినా ఉపయోగం లేదు..
ఆడపిల్ల పుడితే రూ.10 వేలు ఎఫ్డీ చేస్తా... సర్పంచ్ అభ్యర్థి హామీ
ఏంది సామీ ఇదీ.. నువ్వు నేతవా.. మాంత్రికుడివా
రోడ్డుపక్కన గుట్టలు గుట్టలుగా ఏటీఎం కార్డులు
ఈ కోతులు సల్లగుండా సర్పంచ్ ఎన్నికలనే మార్చేశాయిగా
ఫోన్ మాన్పించాలని చెస్ నేర్పితే.. చివరికి
దారుణం.. తనకంటే అందంగా ఉన్నారని.. అలా ఎలా చేసింది.. బాబోయ్
బాబోయ్.. ప్రసూతి ఆస్పత్రిలో ఎలుకలు

