గోదారోళ్లా.. మజాకా.. భార్యను ఎత్తుకొని తిరుమల కొండెక్కిన సత్తిబాబు !!
గోదారోళ్ళు అంటే ఎటకారమే కాదు భక్తి, ప్రేమాభిమానాలకు పెట్టింది పేరు. ఊరికే మాటలు చెప్పడం కాదు చేతలతో చూపిస్తుంటారు. ఇదిగో అలాంటి దంపతులే వీరు.
గోదారోళ్ళు అంటే ఎటకారమే కాదు భక్తి, ప్రేమాభిమానాలకు పెట్టింది పేరు. ఊరికే మాటలు చెప్పడం కాదు చేతలతో చూపిస్తుంటారు. ఇదిగో అలాంటి దంపతులే వీరు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకకు చెందిన లారీ ట్రాన్స్‌పోర్ట్ యజమాని వరదా వీర వెంకట సత్యనారాయణ అలియాస్ సత్తిబాబు, లావణ్య దంపతులు ఏడుకొండలు దర్శనానికి తిరుపతి వెళ్లారు. గోదావరి జిల్లాల వారు అధికంగా కాలినడకనే ఏడు కొండలు ఎక్కుతామని మొక్కుకుంటారు. వీరు కూడా శ్రీవారి మెట్లు నడిచి వెళ్లు తున్నారు. అయితే వేగంగా మెట్లు ఎక్కుతున్న సత్తిబాబును చూసి భార్య లావణ్య మీరు ఎక్కడం కాదు దమ్ముంటే నన్ను ఎత్తుకుని ఎక్కమని సరదాగా సవాల్ చేసింది. ఆ సవాల్ ను సీరియస్ గా తీసుకున్న సత్తిబాబు భార్యను భుజాలపైకి ఎక్కించుకుని మెట్లు ఎక్కడం మొదలు పెట్టారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 70 మెట్లు ఎక్కారు. అలా ఆ జంట వెళ్తుంటే ఫోటోలు,వీడియోలు తీయడానికి మిగిలిన భక్తులు పోటీపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సింహం ఈసారి సింగిల్ గా కాదు.. గుంపుగా వచ్చింది.. చూస్తే దడే
విరిగిపడ్డ మంచుకొండలు.. వీడియో భయానకం
ట్రాఫిక్‌లో ఇరుక్కన్న బెంజ్ కార్ల సీఈవో .. ఏం చేశారో చూస్తే ??
మరీ ఇలా తయారయ్యరేంట్రా.. దెబ్బకు పానిపూరి ప్రేమికుల ఫ్యూజులు ఔట్
ఆనాటి రాముడు.. ఈనాడు ఎయిర్‌పోర్ట్‌లో.. పాదాభివందనం చేస్తున్న భక్తులు..
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

