ట్రాఫిక్‌లో ఇరుక్కన్న బెంజ్ కార్ల సీఈవో .. ఏం చేశారో చూస్తే ??
కామన్‌మాన్ నుంచి కోటిశ్వరుడి వరకు ఎవరైనా ట్రాఫిక్‌లో ఇరుక్కోవాల్సిందే. ఇందుకు ఎవరూ అతీతులు కాదు. ఇలాంటి అనుభవమే బెంజ్ కార్ల సీఈఓకు ఎదురైంది.
కామన్‌మాన్ నుంచి కోటిశ్వరుడి వరకు ఎవరైనా ట్రాఫిక్‌లో ఇరుక్కోవాల్సిందే. ఇందుకు ఎవరూ అతీతులు కాదు. ఇలాంటి అనుభవమే బెంజ్ కార్ల సీఈఓకు ఎదురైంది. మెర్సిడెస్ బెంజ్ ఇండియా సీఈఓ మార్టిన్ ష్వెంక్ గురువారం రాత్రి సమయంలో పుణెలో తన ఎస్-క్లాస్ కార్‌లో ప్రయాణిస్తుండగా ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. ఎంతకీ ట్రాఫిక్ క్లియర్ కాకపోవడంతో ఖరీదైన ఎస్-క్లాస్ కారు నుంచి దిగి నడక బాటపట్టారు. ఇలా కిలోమీటర్లు నడిచి.. ఆటోలో తన గమ్య స్థానానికి చేరుకున్నారు. ఈ మొత్తం సంఘటనను ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో వివరించారు. ఆటోలో ప్రయాణిస్తుండగా తీసిన ఫోటోను షేర్ చేస్తూ.. ‘ మీ ఎస్-క్లాస్ కార్ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి ఉంటే మీరు ఏం చేస్తారు? బహుశా కారు దిగి, కొన్ని కిలోమీటర్లు నడిచి, ఆపై రిక్షా పట్టుకుంటారా’ అని క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. సీఈఓ సింప్లిసిటీ నెటిజన్లను ఆకర్షిస్తోంది. అంత కోటీశ్వరుడై ఉండి ఆటోలో వెళ్లడాన్ని పలువురు అభినందిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మరీ ఇలా తయారయ్యరేంట్రా.. దెబ్బకు పానిపూరి ప్రేమికుల ఫ్యూజులు ఔట్
ఆనాటి రాముడు.. ఈనాడు ఎయిర్‌పోర్ట్‌లో.. పాదాభివందనం చేస్తున్న భక్తులు..
ఈ ఒక్క వీడియో చాలు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఛాతి విచ్చుకోడానికి !!
అడ్డంగా దొరికిపోయిన రష్మిక, రౌడీ.. ఇప్పుడు చెప్పండి ప్రేమలో లేమని !!
Khushboo: ఆసుపత్రి బెడ్ పై ఖుష్బూ.. గుర్తుపట్టలేనంతగా..
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్‌లైన్.. మీ పాన్‌కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్‌లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో

