మానవ శరీర భాగాలు .. బ్లాక్ మార్కెట్‌లో విక్రయాలు వీడియో
అమెరికాలోని పెన్సిల్వేనియాలో మార్చురీలో పనిచేసిన మాజీ మేనేజర్ మృతదేహాల నుంచి తలలు, మెదళ్ళు, అవయవాలను వేరుచేసి బ్లాక్ మార్కెట్లో అమ్మేశాడు. పీపుల్ మ్యాగజైన్ ప్రకారం 57 ఏళ్ల సెడ్రిక్ లాడ్జ్ హార్వర్డ్ మెడికల్ స్కూల్ మేనేజర్ గా పనిచేసి రిటైర్ అయ్యాడు. అవయవాలను కొన్న ఓ వ్యక్తి మూడేళ్ల కాలంలో దాదాపు 37,000 డాలర్లు అంటే మన కరెన్సీలో 32 లక్షల రూపాయలను ఈ మేనేజర్ కు పేపాల్ ద్వారా చెల్లించినట్లు తెలిసింది.
చెల్లింపుల సమయంలో హెడ్ నెంబర్ ఏడు వంటి అనుమానాస్పద పదాలు ఉన్నట్లు గుర్తించారు. మసాచుసెట్స్ లోని ఒక మహిళకు మానవ చర్మాన్ని సరఫరా చేసినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. తాజాగా పెన్సిల్వేనియా ఫెడరల్ కోర్టులో విచారణ సందర్భంగా సెడ్రిక్ లాడ్జ్ తన నేరాన్ని అంగీకరించాడు. 2018, 2020 మధ్య వైద్య పరిశోధన కోసం హార్వర్డ్ అనాటోమికల్ గిఫ్ట్ ప్రోగ్రామ్ కు విరాళంగా ఇచ్చిన మార్చురీలోని శవాల్లో నుంచి శరీర భాగాలను దొంగిలించి వాటిని డార్క్ వెబ్ సైట్లలో అంతర్జాతీయ రవాణా చేసినట్లు సెడ్రిక్ లాడ్జ్ తెలిపాడు. బోస్టన్ లోని హార్వర్డ్ మార్చురీ నుంచి దొంగిలించిన శరీర భాగాలను తన ఇంటికి తీసుకెళ్లి భద్రపరిచేవడినని ఒప్పుకున్నాడు.
మరిన్ని వీడియోల కోసం :
వచ్చిందమ్మ మాలక్ష్మి.. ఆడపిల్ల పుట్టిందని సంబరాలు వీడియో
అక్కడ అగరొత్తులు కాదు సిగరెట్లు వెలిగిస్తారు .. ఎందుకంటే వీడియో
సినిమాలోని దెయ్యం థియేటర్‌లోకి వచ్చిందా వీడియో
ఫస్ట్ నైట్ తర్వాత రోజే విడిపోయిన దంపతులు.. భర్త చేసిన పనికి నవ వధువు షాక్ వీడియో
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా
