సూదితో పొడవకుండానే రక్త పరీక్ష.. దేశంలో ఫస్ట్ టైమ్ హైదరాబాద్‌లో వీడియో
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తున్న అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. మరీ ముఖ్యంగా వైద్యరంగంలో ఏఐ వావ్ అనేలా సేవలు అందిస్తుంది. తాజాగా ఏఐ ద్వారా మరో అద్భుతాన్ని సాధించారు వైద్యులు. సూదితో పొడవకుండానే రక్త పరీక్షలు నిర్వహించే టెక్నాలజీని అభివృద్ధి చేశారు. అంతేకాక దీన్ని దేశంలోనే తొలిసారి హైదరాబాద్ లోని నీలోఫర్ ఆసుపత్రిలో అధికారికంగా ప్రారంభించారు. సాధారణంగా రక్త పరీక్ష చేయాలంటే సూదితో గుచ్చి రక్తాన్ని తీసుకొని పరీక్షలు చేస్తారు. రిజల్ట్ కూడా త్వరగా రాదు. ఎదురుచూడాల్సి ఉంటుంది.
ఇకపై వీటికి చెక్ పెట్టేందుకు ఏఐ రెడీ అయింది. సూదితో పొడిచి రక్తం తీయాల్సిన పని లేకుండానే రక్త పరీక్ష చేసేందుకు సరికొత్త పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా కేవలం ముఖాన్ని స్కాన చేస్తే చాలు. కీలకమైన ఆరోగ్య వివరాలు తెలుస్తాయి. ఇది ఎలా సాధ్యమంటే దీనికోసం ఏఐ ఆధారిత డయాగ్నొస్టిక్ సాధనాన్ని అభివృద్ధి చేశారు. దీన్ని తొలిసారిగా హైదరాబాద్ లోని నీలోఫర్ ఆసుపత్రిలో ప్రవేశపెట్టారు. ఇకపై సూదితో పొడిచే పని లేకుండానే కేవలం ముఖాన్ని స్కాన చేయడం ద్వారా రక్త పరీక్షలు చేయవచ్చు. ఏఐ ని బేస్ చేసుకొని రూపొందించిన ఈ టెక్నాలజీని అమృత్ స్వస్థ భారత్ కార్యక్రమంలో భాగంగా ఫిట్ విటల్స్ సంస్థ అభివృద్ధి చేసింది. ఈ విధానం చిన్న పిల్లలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వైద్యులు తెలిపారు. మొదటి దశలో భాగంగా రెండు నెలల పాటు సుమారు వెయ్యి మంది పిల్లలకు ఈ పరికరంతో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఆ తర్వాత వారి నుంచి సేకరించిన రిపోర్టులను క్షుణ్ణంగా పరిశీలిస్తామని నీలోఫర్ సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్ తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతమైతే రాష్ట్రంలోని అన్ని ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లోను ఈ అత్యాధునిక విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వానికి సూచిస్తామని తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం :
వచ్చిందమ్మ మాలక్ష్మి.. ఆడపిల్ల పుట్టిందని సంబరాలు వీడియో
అక్కడ అగరొత్తులు కాదు సిగరెట్లు వెలిగిస్తారు .. ఎందుకంటే వీడియో
సినిమాలోని దెయ్యం థియేటర్‌లోకి వచ్చిందా వీడియో
ఫస్ట్ నైట్ తర్వాత రోజే విడిపోయిన దంపతులు.. భర్త చేసిన పనికి నవ వధువు షాక్ వీడియో

ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ..అరగంట తర్వాత వీడియో

పెళ్లి రోజు వధువు షాకింగ్ ట్విస్ట్.. బిత్తరపోయిన కుటుంబ సభ్యులు

కౌగిలించుకుంటే కాసుల పంట ఆ దేశంలో వినూత్న ట్రెండ్ వీడియో

బందర్లో దృశ్యం మార్క్ క్రైమ్ కహానీ..భర్త హత్యకు శ్రీమతి స్కెచ్

హనీమూన్లో విషాదం.. రైలు ఎక్కబోతూ అనంతలోకాలకు వీడియో

యజమాని కోసం కుక్క ప్రాణత్యాగం.. 26 సార్లు పాముకాట్లు వీడియో

70 ఏళ్లుగా సహజీవనం! ఎట్టకేలకు పెళ్లి చేసిన పిల్లలు వీడియో
