అక్కడ అగరొత్తులు కాదు సిగరెట్లు వెలిగిస్తారు .. ఎందుకంటే వీడియో
ఎక్కడైనా దేవాలయాలో, సమాధుల దగ్గర పండ్లు, శనగలు, పులిహోర నైవేద్యంగా పెట్టడం చూస్తుంటాం. ఉత్తరప్రదేశ్ లోనే లక్నో సమీపంలో ఓ సమాధికి సిగరెట్లు, మద్యం, మాంసాన్ని సమర్పిస్తున్నారు. లక్నోలోని చారిత్రక ముసాబాగ్ కోట వెనుక ఈ సమాధి ఉంది. దీన్ని అంగ్రేజీ బాబా, గోరేబాబా, సమాధి బాబా అనే పేర్లతో స్థానికులు పిలుస్తున్నారు. చరిత్రకారుల కథనం ప్రకారం 1858 మార్చ్ లో ముసాబాగ్ కోట కేంద్రంగా స్థానికంగా ఉన్న స్వాతంత్ర్య సమరయోధులు ఆంగ్లేయులతో యుద్ధం చేశారు.
యుద్ధంలో బ్రిటిషర్లు గెలిచిన బ్రిటిష్ ప్రభుత్వానికి చెందిన క్యాప్టెన్ వెల్స్, సహా చాలామంది ఆంగ్ల సైనికులు మరణించారు. ఆ తర్వాత క్యాప్టెన్ వెల్స్ కు గుర్తుగా ముసాబాగ్ కోట వెనుక బ్రిటిషర్లే ఓ సమాధిని నిర్మించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఆ సమాధి దగ్గర స్థానికులు ప్రార్థనలు చేయడం ప్రారంభించారు. కొన్నాళ్లకు ప్రతి గురువారం ఒక ఉత్సవం కూడా మొదలు పెట్టారు. సమాధి వద్ద గురువారం రాత్రులు తెల్లటి దుస్తులు ధరించిన బాబా కనిపించి సిగరెట్లు, మద్యం అడుగుతున్నారని స్థానికంగా ప్రచారం జరిగింది. దీంతో ప్రజలు అంగ్రేజీ బాబా సమాధి వద్ద సిగరెట్లు వెలిగించే సంప్రదాయాన్ని కూడా కొనసాగిస్తున్నారు. బిస్కెట్లు, బ్రెడ్లు, పువ్వులు, మిఠాయిలు, మాంసం సైతం పెడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
పని చేద్దామని పొలంలోకి వెళ్లిన రైతు.. ఒక్కసారిగా షాక్ వీడియో
చెట్టు కింద పడుకున్న వ్యక్తి.. మట్టి పోసి చంపేశారా..! అసలేం జరిగింది?వీడియో
కస్టమర్‌ను చితకబాదిన జెప్టో డెలివరీ బోయ్.. ఎందుకో తెలిస్తే వీడియో
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
