Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినిమాలోని దెయ్యం థియేటర్‌లోకి వచ్చిందా వీడియో

సినిమాలోని దెయ్యం థియేటర్‌లోకి వచ్చిందా వీడియో

Samatha J

|

Updated on: May 30, 2025 | 2:23 PM

70 ఎంఎం థియేటర్ లో సినిమా చూస్తే ఆ కిక్కే వేరు. పెద్ద స్క్రీన్ పై అభిమాన హీరోల యాక్షన్, డాన్స్, ఫైట్స్ ను తనివితీరా చూస్తే తేగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే ఇక హారర్ సినిమా చూడాలంటే చిన్న స్క్రీన్ మీద మజానే ఉండదు. పెద్ద స్క్రీన్ మీద భయంకరమైన సీన్స్ చూసి తీరాలసిందే. అది ఒక అద్భుతమైన ఉత్కంఠభరితమైన అనుభవాన్ని ఇస్తుంది. కానీ అర్జెంటీనాలో ఒక మహిళకు షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. థియేటర్ లో హారర్ సినిమా చూస్తుండగా అది బయటకు వచ్చింది. ఫైనల్ డెస్టినేషన్ సినిమాను చూస్తూ హారర్ సీన్ లో మునిగిపోయింది.

ఇందులో జరిగిన అనుహ్య సంఘటనను ఒక్కసారిగా షాక్ కు గురిచేసింది. సినిమాలోని హారర్ నిజ జీవితంలో జరిగినట్లు అనిపించిందని ఆ మహిళ వణుకుపోయింది. సోమవారం అర్జెంటీనాలోని లా ఫ్లాటాలోని సినిమా ఓచో థియేటర్ లో ఈ సంఘటన జరిగింది. సినిమాలో ఉత్కంఠభరితమైన క్లైమాక్స్ కు చేరుకుంటుండగా సినిమా హాల్ పైకప్పులోని ఒక భాగం కూలిపోయింది. కింద ఉన్న సీట్ల మీద అమాంతం పడిపోయింది. ఈ ఘటనలో ప్రేక్షకుడికి గాయాలయ్యాయి. ఫియమ్మ విల్లావర్డేగా గుర్తించబడిన ఆ మహిళ తన 11 ఏళ్ల కుమార్తెను వారి స్నేహితుడితో కలిసి థియేటర్ కు వెళ్ళింది. సినిమా ప్రారంభమైన కాసేపటికే థియేటర్ పైకప్పు కూలిపోయింది. సినిమాలోని ఉత్కంఠభరితమైన బిగ్గరగా ఉండే సౌండ్ ఎఫెక్ట్స్ మరియు యాక్షన్ సన్నివేశాలు చూస్తున్నప్పుడు పైకప్పు కూలిపోయింది. అయితే ఉరుములాంటి శబ్దం అంతా కొనసాగుతున్న సన్నివేశం నుండి వచ్చిందని అంతా భావించారు.

మరిన్ని వీడియోల కోసం :

పని చేద్దామని పొలంలోకి వెళ్లిన రైతు.. ఒక్కసారిగా షాక్ వీడియో

చెట్టు కింద పడుకున్న వ్యక్తి.. మట్టి పోసి చంపేశారా..! అసలేం జరిగింది?వీడియో

కస్టమర్‌ను చితకబాదిన జెప్టో డెలివరీ బోయ్‌.. ఎందుకో తెలిస్తే వీడియో