Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పొలాలను వదిలి చెరువుల్లోకి చేపలు వీడియో

పొలాలను వదిలి చెరువుల్లోకి చేపలు వీడియో

Samatha J

|

Updated on: May 31, 2025 | 2:04 PM

వర్షాకాలం మొదలైంది. ఋతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు, కుంటలు నిండుతున్నాయి. వేసవిలో చెరువులు ఎండిపోవడంతో కొద్దిపాటి నీరుండే పొలాలను, కుంటలను ఆశ్రయించిన చేపలు ఇప్పుడు మళ్ళీ చెరువుల్లోకి కియ్యూ కడుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుండటంతో ఏపీలోని ముమ్మిడివరం మండలం, ఠాణేలంక గ్రామ చెరువులకు పండుగ వాతావరణం నెలకొంది. చుట్టుపక్కల చేల నుండి చిన్న చిన్న గుంతల నుండి చేపలు పెద్ద సంఖ్యలో చెరువుల్లోకి వలస వస్తున్నాయి.

ఈ చేపల వలస ఒక వింతైన దృశ్యం. ఎప్పుడూ బురదలోనో, చిన్న నీటి కుంటల్లోనో ఉండే ఈ చిన్న చేపలు వర్షపు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి ఇప్పుడు విశాలమైన చెరువులో స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. ఇది చూస్తుంటే చిన్న చేపకు పెద్ద చెరువు తగినినట్లు ఉంది అనే సామెత గుర్తుకు రాకమానదు. కొంతమంది గ్రామస్తులు దీన్ని ప్రకృతి సహజమైన ప్రక్రియగా భావిస్తుంటే మరికొందరు మాత్రం సరదాగా కామెంట్లు చేస్తున్నారు. మన ఊరి చేపలకు కూడా హాలిడే మూడ్ వచ్చింది. పొలాలలో కష్టపడి అలసిపోయి ఇప్పుడు రిలాక్స్ అవ్వడానికి చెరువులకు వెళుతున్నాయి అంటూ చేపలను చూసి నవ్వుకుంటున్నారు. ఏదేమైనా ఈ చేపలు వరుసగా చెరువుల్లోకి వలస వెళుతున్న దృశ్యం అందరినీ ఆకట్టుకుంటుంది. వర్షపు నీటితో నిండిన చెరువులు వాటిలో స్వేచ్ఛగా తిరుగుతున్న చేపలు ఈ దృశ్యం నిజంగా కనువిందు చేస్తుంది.

మరిన్ని వీడియోల కోసం :

వచ్చిందమ్మ మాలక్ష్మి.. ఆడపిల్ల పుట్టిందని సంబరాలు వీడియో

అక్కడ అగరొత్తులు కాదు సిగరెట్లు వెలిగిస్తారు .. ఎందుకంటే వీడియో

సినిమాలోని దెయ్యం థియేటర్‌లోకి వచ్చిందా వీడియో

ఫస్ట్‌ నైట్‌ తర్వాత రోజే విడిపోయిన దంపతులు.. భర్త చేసిన పనికి నవ వధువు షాక్‌ వీడియో