Gulab Jamun Chat: గులాబ్ జామూన్ చాట్ తిన్నారా ఎప్పుడైనా?  ఇదెక్క‌డి కాంబో బాబోయ్ అంటున్న నెటిజ‌న్లు..

Gulab Jamun Chat: గులాబ్ జామూన్ చాట్ తిన్నారా ఎప్పుడైనా? ఇదెక్క‌డి కాంబో బాబోయ్ అంటున్న నెటిజ‌న్లు..

Anil kumar poka

|

Updated on: Apr 01, 2022 | 8:38 PM

స్ట్రీట్‌ ఫుడ్‌ అంటే ఇష్టపడని వారుండరు. సాయంత్రం వేళ అలా బయటకు వెళ్లి వేడి వేడిగా ఛాట్‌ తింటే ఆ మజానే వేరు... అయితే ఇటీవల స్ట్రీట్‌ ఫుడ్‌ వ్యాపారులు కస్టమర్స్‌ను ఆకట్టుకోడానికో, సోషల్‌ మీడియాలో పాపులర్‌ కావడానికో గానీ.. రకరకాల ఫుడ్‌ ఎక్స్‌పెర్‌మెంట్స్‌ చేస్తూ..


స్ట్రీట్‌ ఫుడ్‌ అంటే ఇష్టపడని వారుండరు. సాయంత్రం వేళ అలా బయటకు వెళ్లి వేడి వేడిగా ఛాట్‌ తింటే ఆ మజానే వేరు… అయితే ఇటీవల స్ట్రీట్‌ ఫుడ్‌ వ్యాపారులు కస్టమర్స్‌ను ఆకట్టుకోడానికో, సోషల్‌ మీడియాలో పాపులర్‌ కావడానికో గానీ.. రకరకాల ఫుడ్‌ ఎక్స్‌పెర్‌మెంట్స్‌ చేస్తూ.. కొత్త కొత్త రుచులను ఫుడ్‌ ప్రియులకు అందిస్తున్నారు. ఇదిగో ఇదికూడా అలాంటిదే. ఇంత వరకూ ఐస్‌ క్రీమ్‌ సమోసా, ఐస్‌క్రీమ్‌ గోల్‌గప్పా, ఐస్‌క్రీమ్‌ దోస, ఫాంటా మ్యాగీ ఇలా రకరకాల ప్రయోగాలు చేసి నెటిజన్లను ఆకట్టుకున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి గులాబ్‌ జామ్‌ చేరింది. ఇప్పుడు మార్కెట్‌లో హల్‌చల్‌ చేస్తున్న కొత్త వంటకం గులాబ్‌ జామ్‌ చాట్‌… ఇది తిన్న కస్టమర్లు ఆ టేస్ట్‌కి రకరకాల ఎక్స్‌ప్రెషన్స్‌ ఇస్తున్నారు. ఇదేం కాంబోరా నాయనా అంటూ నోరెళ్లబెడుతున్నారు. నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ చాట్‌ గులాబ్‌ జామ్‌ తయారీ వీడియో టంగ్ ట్విస్ట‌ర్ అనే ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఒక వ్యక్తి ఒక ప్లేట్‌లో ముందుగా గులాబ్‌ జామూన్‌లు వేశాడు. ఆ తర్వాత వాటిపైన పెరుగు, ఆ తర్వాత టమాటా సాస్‌ కూడా వేశాడు. అనంతరం ఒక గోల్‌గప్ప చిదిమి దానిపైన వేశాడు… ఇంకా గ్రీన్‌ ఛట్నీ, కొద్దిగా సన్నకారప్పూస, చివరిగా కొన్ని దానిమ్మ గింజలు వేశాడు. అంతే గులాబ్‌ జామ్‌ చాట్‌ రెడీ అయిపోయింది. ఆ వీడియోను చూసిన నెటిజ‌న్లు.. ఇదెక్క‌డి కాంబో బాబోయ్ అంటూ నోరెళ్ల‌బెడుతున్నారు. ఇలాంటి వంటకం కూడా ఒకటుందా అంటున్నారు. మరి ఈ వీడియో చూసి.. .ఆ చాట్‌ను ఒకసారి మీరు కూడా ట్రైచేస్తారా…!

మరిన్ని చూడండి ఇక్కడ:

Wedding Viral Video: లవ్లీ సర్ ప్రైజ్ ఇచ్చిన వరుడు..నవ వధువు ఫిదా! ఈ వీడియోకు లైకుల వర్షం..

Viral Video: పాములు ఇలా కూడా పగ పడతాయా..? ఏడు నెలల్లో మూడు సార్లు కాటు.. యువతిని వెంటాడిన పాము

Chimpanzee Video: నా ఫుడ్‌ జోలికొస్తే తగ్గేదే లే.. చింపాంజీ చేసిన పనికి నవ్వాగదు.. పడి పడి నవ్వాల్సిందే..

Viral Video: బస్‌స్టాప్‌లో అదేం పని రా బాబు.! సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌.!

Viral Video: ఓరి వీడి దుంపతెగ.. ఎంత పని చేసాడు.. రోగిని పట్టుకొని అర్జున్ రెడ్డి సీన్ రిపీట్ చేసాడు..