అసలు జాతిరత్నం మనోడే !! బోర్డు పరీక్షల్లో పాస్ చేయాలంటూ ??
గుజరాత్‌లో 12వ తరగతి విద్యార్థి బోర్డు పరీక్షల్లో “దయచేసి పాస్ చేయండి” అంటూ ఎగ్జామినర్‌ని అభ్యర్థిస్తూ పేపర్‌పై 500 రూపాయల నోటు అతికించాడు.
గుజరాత్‌లో 12వ తరగతి విద్యార్థి బోర్డు పరీక్షల్లో “దయచేసి పాస్ చేయండి” అంటూ ఎగ్జామినర్‌ని అభ్యర్థిస్తూ పేపర్‌పై 500 రూపాయల నోటు అతికించాడు. ఈ సంవత్సరం బోర్టు పరీక్షలు ముగియడంతో ప్రస్తుతం ముల్యాంకనం కొనసాగుతోంది. అయితే.. జవాబు పత్రాల మూల్యాంకన సమయంలో ఉపాధ్యాయులు ఫిజిక్స్, కెమిస్ట్రీ పేపర్లలో కరెన్సీని గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తీరా, విద్యార్థి ప్రయత్నం విఫలం కావడంతో.. ఏడాదిపాటు పరీక్షలు రాయకుండా అధికారులు డిబార్ చేశారు. అంతేకాకుండా ప్రస్తుత పరీక్షల్లో ఫెయిల్ చేశారు. అయితే.. విద్యార్థి అన్ని పేపర్లలో ఫెయిల్ అయినట్లు అధికారులు తెలిపారు. దీనిపై గుజరాత్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ పరీక్షా సంస్కరణల కమిటీని వివరణ కూడా కోరింది. అయితే.. డబ్బులు దొరకడంతో విద్యార్థిని అధికారులు ప్రశ్నించారు. బోర్డు పరీక్షల్లో పాస్ అవుతానన్న నమ్మకం లేదని.. దీంతో జవాబు పత్రంలో డబ్బును ఉంచితే ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉందని పుకార్లు విన్నానని బాలుడు ఒప్పుకున్నాడు. అయితే.. అలా చేయడం తనకు తెలియదని అతను చెప్పాడు. విద్యార్థి మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడని.. అతని తల్లిదండ్రులు ట్యూషన్‌కు కూడా పంపారని.. అయినా పరీక్షలకు సరిగ్గా సిద్ధం కాలేకపోయాడని అధికారులు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రచ్చ లేపిన కండోమ్ యాడ్ !! అసలు విషయం తెలిస్తే షాక్ !!
సముద్రంలో చేపల కోసం వల వేస్తే ఊహించనిది చిక్కింది !!
ఫోన్‌కు బానిసలు అయిన కప్పలు !! వీడియో చూస్తే మైండ్ బ్లాంకే
కంటి నొప్పితో ఆస్పత్రికెళ్లిన యువకుడు !! స్కాన్ చేయగా ఖంగుతిన్న డాక్టర్లు !!
Samantha: అంతే మరి !! ఆ షోలో ఎక్కువ మాట్లాండింది. ఇప్పుడు అనుభవిస్తుంది
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!

