Google-Smart Phone Users: గూగుల్‌ కీలక నిర్ణయం.. స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు బిగ్‌ షాక్‌.. ఇకపై వాటికి చెక్‌..!

Google-Smart Phone Users: గూగుల్‌ కీలక నిర్ణయం.. స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు బిగ్‌ షాక్‌.. ఇకపై వాటికి చెక్‌..!

Anil kumar poka

|

Updated on: May 01, 2022 | 9:38 AM

ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు గట్టి షాక్‌ తగిలింది. యాప్స్‌ విషయంలో గూగుల్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ లలో కాల్​రికార్డింగ్ యాప్స్‌ను తొలగించనున్నట్టు స్పష్టం చేసింది. ఈ యాప్స్‌ కారణంగా యాజర్ల ప్రైవసీ దెబ్బతింటుందని,


ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు గట్టి షాక్‌ తగిలింది. యాప్స్‌ విషయంలో గూగుల్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ లలో కాల్​రికార్డింగ్ యాప్స్‌ను తొలగించనున్నట్టు స్పష్టం చేసింది. ఈ యాప్స్‌ కారణంగా యాజర్ల ప్రైవసీ దెబ్బతింటుందని, ఈ కారణంగా థర్డ్‌ పార్టీ కాల్ రికార్డింగ్ యాప్స్​అన్నింటినీ నిలిపేయాలని గూగుల్‌ నిర్ణయించింది. ఈ కొత్త నిబంధనలు మే 11 నుంచి అమల్లోకి వచ్చే అవకాశాలున్నట్లు తెలిపింది. అయితే స్మార్ట్‌ఫోన్‌లో వాయిస్‌ కాల్‌ మాట్లాడుతున్నప్పుడు ఆన్‌లైన్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొంటున్న సమయంలో ఆ కాల్స్‌ను రికార్డ్‌ చేసేందుకు వీలుండదు. గూగుల్‌ డయలర్‌ లేదా స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీలు డిఫాల్ట్‌గా ఇచ్చే డయలర్‌ ద్వారా మాత్రమే ఇకపై కాల్‌ రికార్డింగ్‌ ఫీచర్‌ అందుబాటులో ఉండనుంది. గూగుల్ డయలర్‌ ద్వారా ఎవరైనా ఈ ఫీచర్‌ను ఉపయోగించినట్లయితే మీ అవతలి వ్యక్తి కూడా ఈ కాల్ రికార్డు చేస్తున్నారని మిమ్మల్ని అలర్ట్‌ చేస్తుంది.కాల్‌ రికార్డును గూగుల్‌ ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉంది. కాల్‌ రికార్డింగ్‌ సమయంలో అవతలి వ్యక్తికి తెలియకుండా ఫోన్‌లో వారి వాయిస్‌ను రికార్డ్ చేయడం ద్వారా యూజర్ల ప్రైవసీకి భంగం కలిగే ప్రమాదం ఉందని గూగుల్‌ చాలా సందర్భాలలో హెచ్చరించింది. యూజర్ల ప్రైవసీ దెబ్బతినకుండా ఉండేందుకే కాల్‌ రికార్డింగ్‌ యాప్స్‌ను తొలగింపు నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్‌ తెలిపింది. అయితే ఆండ్రాయిడ్‌ 6 OS తీసుకువచ్చినప్పుడు ఈ యాప్స్‌పై తొలిసారిగా వేటు వేసింది గూగుల్‌. కాల్‌ రికార్డింగ్‌కు వీలు కల్పించే ఏపీఐని తొలగించింది. అయితే యాప్‌ డెవలపర్స్‌ ప్రత్యామ్నాయలపై దృష్టి సారించారు. సరికొత్త కాల్‌ రికార్డింగ్‌ యాప్స్‌ను తీసుకువచ్చారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Tom and jerry: పిల్లికి అడ్డంగా దొరికిపోయిన ఎలుక.. ఏం చేసిందో చూడండి..! టామ్ అండ్ జెర్రీ కంటే ఫన్నీ వీడియో..

Super Star Krishna latest: అయ్యో.. ‘సూపర్‌ స్టార్‌ కృష్ణ’కు ఏమైంది..?చూసి షాక్ లో అభిమానులు..

viral video: వేరే మహిళతో ప్రియుడి పెళ్లి.. తాళికట్టే మంటపానికి ప్రియురాలు ఎంట్రీ..!

Viral Video: నడిరోడ్డుపై వీరనారి.. విశ్వరూపం చూపించేసిందిగా.. ఔరా.. అంటున్న నెటిజనం..