Goods Train: డ్రైవర్ లేకుండా 70 కి.మీ గూడ్సు రైలు పరుగులు.! వీడియో..
జమ్ముకశ్మీర్‌లోని కథువా రైల్వే స్టేషన్‌లో అధికారులు నిర్లక్ష్యం వెలుగు చూసింది. నిలిపి ఉంచిన గూడ్స్ రైలు అకస్మాత్తుగా డ్రైవర్ లేకుండానే పఠాన్‌కోట్ వైపు ఏకంగా 70 కిలోమీటర్ల దూరం వరకూ పరుగులు తీసింది. తాజాగా ఆదివారం ఉదయం 8.47 గంటలకు క్రషర్లతో నిండిన గూడ్స్ రైలు డ్రైవర్ లేకుండానే జమ్మూలోని కథువా స్టేషన్ నుండి పంజాబ్‌లోని హోషియార్‌పూర్ వైపు వేగంగా పరుగులుపెట్టింది.
జమ్ముకశ్మీర్‌లోని కథువా రైల్వే స్టేషన్‌లో అధికారులు నిర్లక్ష్యం వెలుగు చూసింది. నిలిపి ఉంచిన గూడ్స్ రైలు అకస్మాత్తుగా డ్రైవర్ లేకుండానే పఠాన్‌కోట్ వైపు ఏకంగా 70 కిలోమీటర్ల దూరం వరకూ పరుగులు తీసింది. తాజాగా ఆదివారం ఉదయం 8.47 గంటలకు క్రషర్లతో నిండిన గూడ్స్ రైలు డ్రైవర్ లేకుండానే జమ్మూలోని కథువా స్టేషన్ నుండి పంజాబ్‌లోని హోషియార్‌పూర్ వైపు వేగంగా పరుగులుపెట్టింది. సమాచారం అందిన వెంటనే రైల్వే అధికారులు రైలును ఆపేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఏటవాలుగా ఉన్న మార్గం కారణంగా రైలు వేగం పుంజుకుంది. దీంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. ఈ విషయమై ఆ మార్గంలోని అన్ని రైల్వే స్టేషన్లకు తెలియజేశారు. ఎట్టకేలకు కథువాకు 70 కిలోమీటర్ల దూరంలోని హోషియార్‌పూర్‌లోని దాసుహా వద్ద ఆ గూడ్స్ ను నిలిపివేయగలిగారు. రైల్వే ట్రాక్‌పై చెక్క దిమ్మెలను ఉంచి, రైలును ఆపడంలో రైల్వే ఉద్యోగులు విజయం సాధించారు. గూడ్సు డ్రైవర్ మాట్లాడుతూ తాను ఆ రైలుకు హ్యాండ్‌బ్రేక్ వేయడం మర్చిపోయానని, ఫలితంగా ఆ రైలు పట్టాల వాలు కారణంగా ఆటోమేటిక్‌గా ముందుకు కదిలిందని తెలిపాడు. రైలు కదులుతున్న సమయంలో తాను అక్కడ లేనని చెప్పాడు. కాగా ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం జరగలేదు. అయితే ఇది ఎలా జరిగిందో తెలుసుకునేందుకు ఫిరోజ్‌పూర్ రైల్వే అధికారుల బృందం జమ్మూ చేరుకుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

