తిరుమలలో గుంటూరు గోల్డ్‌ మ్యాన్‌..3 కేజీల ఆభరణాలతో స్వామి దర్శనానికి

తిరుమలలో గుంటూరు గోల్డ్‌ మ్యాన్‌..3 కేజీల ఆభరణాలతో స్వామి దర్శనానికి

Phani CH

|

Updated on: Apr 06, 2024 | 5:15 PM

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసుని దర్శించుకునేందుకు ప్రతిరోజూ వేలల్లో భక్తులు తరలి వస్తారు. తమ ఆపదలు తీర్చమని, తమ కోరికలు నెరవేర్చమని మొక్కుకుంటారు. ఇందలో ధనవంతులు ఉంటారు.. పేదవారు ఉంటారు.. మధ్య తరగతివారు ఉంటారు. తాజాగా తిరుమల శ్రీవేంకటేశ్వరుని దర్శించుకునేందుకు ఓ భక్తుడు ఏకంగా ఒంటినిండా నగలతో ప్రత్యక్షమయ్యాడు. అలంకరణలో స్వామివారితోనే పోటీపడతున్నట్టుగా ఆయన ఒంటినిండా నగలతో తిరుమల వీధుల్లో నడుస్తుంటే భక్తులు ఆసక్తిగా చూస్తుండిపోయారు.

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసుని దర్శించుకునేందుకు ప్రతిరోజూ వేలల్లో భక్తులు తరలి వస్తారు. తమ ఆపదలు తీర్చమని, తమ కోరికలు నెరవేర్చమని మొక్కుకుంటారు. ఇందలో ధనవంతులు ఉంటారు.. పేదవారు ఉంటారు.. మధ్య తరగతివారు ఉంటారు. తాజాగా తిరుమల శ్రీవేంకటేశ్వరుని దర్శించుకునేందుకు ఓ భక్తుడు ఏకంగా ఒంటినిండా నగలతో ప్రత్యక్షమయ్యాడు. అలంకరణలో స్వామివారితోనే పోటీపడతున్నట్టుగా ఆయన ఒంటినిండా నగలతో తిరుమల వీధుల్లో నడుస్తుంటే భక్తులు ఆసక్తిగా చూస్తుండిపోయారు. ఆ భక్తుడితో సెల్ఫీలకు పోటీపడ్డారు. దాదాపు మూడు కిలోలకు పైనే బంగారు ఆభరణాలను ధరించి అలంకార ప్రియుడైన శ్రీవారిని దర్శించుకుని తరించాడు గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన గడ్డిపాటి సాంబశివరావు. గోల్డ్‌ అంటే సాంబశివరావుకు ఎంతో మక్కువ. పది వేళ్లకు పెద్ద పెద్ద ఉంగరాలు, చేతికి కడియాలు, మెడనిండా గొలుసులతో స్వామి సన్నిధికి నగల దుకాణం కదలివస్తుందా అన్నట్టుగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇదంతా స్వామి ఆశీర్వాదమేనని చెబుతున్నారు సాంబశివరావు. ఒంటినిండా నగలతో మెరిసిపోతున్న గోల్డ్‌ మెన్‌తో సెల్ఫీలకు ఎగబడ్డారు భక్తులు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విశాఖ ఆర్కే బీచ్‌‌ తీరంలో విషపూరిత జెల్లీఫిష్‌.. ఈత కొట్టేవారికి పెనుముప్పు

ఇషా అంబానీ ఇంటిని కొన్న హాలీవుడ్ న‌టి.. ఆమె ఆస్తులెంతో తెలుసా ??

ఈ మందుబాబు ఐడియా అదిరింది మావా.. ఏం చేశాడో చూడండి

600 మంది ఉద్యోగులను తొలగించిన మరో దిగ్గజ కంపెనీ

అప్పటికే 45 కోట్ల వసూళ్లు.. ఇది కొండన్న క్రేజ్‌ అంటే