ఇషా అంబానీ ఇంటిని కొన్న హాలీవుడ్ నటి.. ఆమె ఆస్తులెంతో తెలుసా ??
భారత అపరకుబేరుడు ముఖేశ్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ ఇండియాలోనే అత్యంత ఖరీదైన ఇల్లు 'యాంటిలియా'లో నివసిస్తారు. ఎన్నో ప్రత్యేకతలతో కూడిన ఈ భవనం ఖరీదు రూ. 15,000 కోట్లకు పైనే ఉంటుంది. అయితే, ఈ దంపతుల మాదిరిగానే వారి పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు కూడా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది రూపాయలు విలువ చేసే విలాసవంతమైన ఆస్తులను కలిగి ఉన్నారు.
భారత అపరకుబేరుడు ముఖేశ్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ ఇండియాలోనే అత్యంత ఖరీదైన ఇల్లు ‘యాంటిలియా’లో నివసిస్తారు. ఎన్నో ప్రత్యేకతలతో కూడిన ఈ భవనం ఖరీదు రూ. 15,000 కోట్లకు పైనే ఉంటుంది. అయితే, ఈ దంపతుల మాదిరిగానే వారి పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు కూడా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది రూపాయలు విలువ చేసే విలాసవంతమైన ఆస్తులను కలిగి ఉన్నారు. ఇటీవల ముఖేశ్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ, ఆమె భర్త ఆనంద్ పిరమల్ లాస్ ఏంజిల్స్‌లోని తమ విలాసవంతమైన భవనాలలో ఒకదానిని హాలీవుడ్ నటి జెన్నిఫర్ లోపెజ్, ఆమె భర్త బెన్ అఫ్లెక్‌లకు విక్రయించారు. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం ఇషా అంబానీ ఈ జంటకు రూ. 494 కోట్ల భారీ మొత్తానికి ఇంటిని అమ్మినట్లు తెలుస్తోంది. కాగా, ఇషా గర్భవతిగా ఉన్న సమయంలో లాస్ ఏంజెల్స్‌లోని ఈ ఇంట్లో ఎక్కువ సమయం గడిపినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ ఇల్లు ఐదేళ్ల పాటు మార్కెట్‌లో అమ్మకానికి ఉంది. కాగా ఇటీవల జెన్నిఫర్ లోపెజ్ దంపతులు దీన్ని కొనుగోలు చేశారు. సువిశాలమైన ఈ భవనం బెవర్లీ హిల్స్ ప్రాంతంలో 5.2 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. ఇందులో 155 అడుగుల ఇన్ఫినిటీ పూల్, ఇండోర్ పికిల్‌బాల్ కోర్ట్, సెలూన్, జిమ్, స్పాలు తదితర విలాసవంతమైన సౌకర్యాలు ఉన్నాయి. ఈ భవనంలో 12 బెడ్‌రూమ్‌లు, 24 బాత్‌రూమ్‌లు, అవుట్‌డోర్ ఎంటర్‌టైన్‌మెంట్ పెవిలియన్, కిచెన్, లష్ లాన్‌లు ఉంటాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ మందుబాబు ఐడియా అదిరింది మావా.. ఏం చేశాడో చూడండి
600 మంది ఉద్యోగులను తొలగించిన మరో దిగ్గజ కంపెనీ
అప్పటికే 45 కోట్ల వసూళ్లు.. ఇది కొండన్న క్రేజ్ అంటే
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

