Gold Stolen: ప్రైవేటు ట్రావెల్ బస్సులో కోట్ల విలువైన బంగారం చోరీ.!
ఏకంగా 3 కోట్ల విలువైన బంగారు నగలతో ప్రైవేటు ట్రావెల్ బస్సులో బయలుదేరాడు ఓ వ్యాపారి. బస్సు భోజనం కోసం ఓ దాబా దగ్గర ఆగింది. అందరూ దిగారు.. ఈ వ్యాపారి కూడా సిగరెట్ తాగుదామని కిందకు దిగాడు. తిరిగి బస్సు ఎక్కి చూసే సరికి ఆభరణాలు ఉన్న బ్యాగ్ మిస్. లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. సినీ ఫక్కిలో జరిగిన చోరీ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం సత్వార్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి ముంబైకి బయలుదేరింది. అదే బస్సులో బంగారు నగల వ్యాపారి ఆశిష్ నాలుగు కేజీల నగలతో ముంబైకి వెళ్తున్నాడు. బస్సు అర్ధరాత్రి సత్వార్ వద్ద కోహినూర్ దాబా వద్ద ఆగింది. ప్రయాణికులందరూ దిగారు. సిగరెట్ తాగేందుకు ఆశిష్ కిందికి దిగాడు. తిరిగి బస్సెక్కి చూస్తే ఆభరణాలున్న సంచి కనిపించకపోవడంతో లబోదిబోమన్నాడు. దొంగలు ప్రయాణికుల్లా బస్సెక్కడం, ఆ తర్వాత బ్యాగుతో వెళ్లడం దాబా వదనున్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. దాదాపు రూ. 3 కోట్ల విలువైన నగలున్న బ్యాగ్ పోగొట్టుకున్న వ్యాపారి, ఫిర్యాదు సమయంలో తడబాటుకు గురికావడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రెండు కిలోల ఆభరణాలు ఎత్తుకెళ్లారని ఒకసారి, మొత్తం బ్యాగునే ఎత్తుకెళ్లారని మరోసారి వ్యాపారి చెప్పినట్టు పోలీసులు తెలిపారు. ఆ నగలకు సంబంధించిన పూర్తి బిల్లు కావాలని కోరడంతో వ్యాపారి హైదరాబాద్ వెళ్లినట్టు తెలిపిన పోలీసులు ప్రస్తుతం ఫిర్యాదు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.