Goat prays: ముక్కంటికి భక్తుడిగా మారిపోయిన మేక.. గర్భగుడి ముందు మోకారిల్లి మరీ..! వీడియో..
తాజాగా ఓ మేక శివాలయంలో గర్భగుడి ముందు మోకరిల్లింది. మోకాళ్ల మీద కూర్చొని తలవంచుకుని దేవుడిని ప్రార్థించింది. దీంతో
మనుషులే కాదు కొన్ని మూగజీవాలకు కూడా దైవభక్తి చాటుకుంటూ ఉంటాయి. అప్పుడప్పుడు కొన్ని జంతువులు దేవుళ్లను ప్రార్థిస్తుండడం మనం చూసే ఉంటాం. ముఖ్యంగా ఆవులు, కోతులు, కుక్కలు, పాములు దేవుడి ముందు దండం పెట్టుకోవడం గతంలో చూశాం. వీటికి సంబంధించిన వీడియోలు అప్పడప్పుడు సోషల్ మీడియాలో దర్శనమిస్తుంటాయి. తాజాగా ఓ మేక శివాలయంలో గర్భగుడి ముందు మోకరిల్లింది. మోకాళ్ల మీద కూర్చొని తలవంచుకుని దేవుడిని ప్రార్థించింది. దీంతో దేవాలయానికి వచ్చిన భక్తులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. కొందరు ఈ ఘటనను సెల్‌ఫోన్లలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో అవి కాస్తా వైరల్‌గా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఉన్న ఆనందేశ్వర్ మందిరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా ఉదయం నుంచి ఆలయ ప్రాంగణంలో మేక కనిపిస్తోందని ఆలయానికి వచ్చిన భక్తురాలు చెబుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jio Laptop Cost: రూ.15 వేలకే జియో ల్యాప్ టాప్.. ఇన్ బిల్ట్ గా 4జీ సిమ్ కూడా.. జియో ఆఫర్..
Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్ ఫ్రెండ్..