Seller cheating: టిట్ ఫర్ టాట్ అంటే ఇదే.. మోసం చేయాలనుకుంటే ఇలానే మోసపోతారు..!
ఒక వ్యక్తి రోడ్డు పక్కన వేరుశనగలు కొనుగోలు చేస్తుంటాడు. అయితే కొనుగోలు చేసేటప్పుడు తన తెలివిని చూపించడానికి ప్రయత్నిస్తాడు. కానీ వేరు శనగ అమ్మేవాడు అతని కంటే తెలివిగా మారిపోయాడు.
సాధారణంగా రోడ్లపై వెళ్తున్న సమయంలో రోడ్డు పక్కన కొందరు కూరగాయలు, పండ్లు, వస్తువులు అమ్ముతుంటారు. కావాల్సిన వాళ్లు వెళ్లి కొనుక్కుంటారు. అయితే కొంత మంది మాత్రం తాము కొనుగోలు చేసే సమయంలో చేతివాటం ప్రదర్శిస్తుంటారు. వ్యాపారికి తెలియకుండా వస్తువులు, సరకులను కొట్టేస్తుంటారు. ఇలాంటి ఓ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది. ఒక వ్యక్తి రోడ్డు పక్కన వేరుశనగలు కొనుగోలు చేస్తుంటాడు. అయితే కొనుగోలు చేసేటప్పుడు తన తెలివిని చూపించడానికి ప్రయత్నిస్తాడు. కానీ వేరు శనగ అమ్మేవాడు అతని కంటే తెలివిగా మారిపోయాడు. అంతే కాకుండా అతను కూడా దారుణంగా మోసం చేస్తాడు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి వేరుశనగను తూకం వేయమని అడిగాడు. అతను వేరు శనగను తూస్తున్న సమయంలో కుప్పలో నుంచి వేరు శనగను దొంగిలించి తన జేబులో వేసుకుంటాడు. ఇలా చాలాసార్లు చేశాడు. ఇది చిరువ్యాపారి చూశాడు. అతనికి సరైన బుద్ధి చెప్పాలని భావించి, వేరు శనగను సంచిలో వేసే సమయంలో కస్టమర్‌కు మాయమాటలు చెప్పి సగం సరకు కిందే పడేస్తాడు. ఈ ఫన్నీ వీడియో ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లో పోస్ట్ అయింది. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jio Laptop Cost: రూ.15 వేలకే జియో ల్యాప్ టాప్.. ఇన్ బిల్ట్ గా 4జీ సిమ్ కూడా.. జియో ఆఫర్..
Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్ ఫ్రెండ్..
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

