ఈమే.. సంతాన లక్ష్మి !! ఒకే ఈతలో ఏకంగా కబడ్డీ జట్టునే కనేసింది
సాధారణంగా.. మేక ఒక ఈతలో రెండు పిల్లలను.. ఎక్కువలో ఎక్కు నాలుగు లేదా ఐదు పిల్లలు కనడము చూశాం. కానీ.. ఈ మేక మాత్రం ఏకంగా ఓ కబడ్డీ జట్టునే కనేసింది. అవును.. మీరు వింటున్నది నిజమే.. ఏడు పిల్లలకు జన్మనిచ్చిన ఆ మేక ఔరా అనిపించింది. ఈ అరుదైన ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం చిల్లంచర్ల గ్రామంలో చోటుచేసుకుంది. ఏడు పిల్లలు పెట్టిన మేకను చూడడానికి స్థానికులు క్యూ కట్టారు.
సాధారణంగా.. మేక ఒక ఈతలో రెండు పిల్లలను.. ఎక్కువలో ఎక్కు నాలుగు లేదా ఐదు పిల్లలు కనడము చూశాం. కానీ.. ఈ మేక మాత్రం ఏకంగా ఓ కబడ్డీ జట్టునే కనేసింది. అవును.. మీరు వింటున్నది నిజమే.. ఏడు పిల్లలకు జన్మనిచ్చిన ఆ మేక ఔరా అనిపించింది. ఈ అరుదైన ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం చిల్లంచర్ల గ్రామంలో చోటుచేసుకుంది. ఏడు పిల్లలు పెట్టిన మేకను చూడడానికి స్థానికులు క్యూ కట్టారు. అంతే కాదు.. చుట్టు పక్కల ఊర్ల నుంచి కూడా వచ్చి చూసిపోతున్నారు. రైతు రేఖ వెంకన్నకు చెందిన ఈ మేక గతంలో మూడు పిల్లలకు జన్మనిచ్చింది. తాజాగా పెట్టిన ఏడు పిల్లల్లో మూడు పోతు పిల్లలు, నాలుగు కొదుమ పిల్లలు ఉన్నాయి. ఏడు మేక పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉన్నాయని రైతు వెంకన్న చెప్పారు. ఒకేసారి ఏడు పిల్లలు పుట్టడంతో వెంకన్న సంతోషం వ్యక్తం చేశారు. తమ ఇంటికి మేక రూపంలో మహాలక్ష్మి వచ్చిందని చెబుతున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కంగనాను కొట్టిన CISF కానిస్టేబుల్కు ఊహించని షాక్..
Balakrishna: హీరోయిన్ రిసెప్షన్.. బాలయ్య ఫన్నీ మూమెంట్
Manamey: OTT స్ట్రీమింగ్‌కు సిద్దమైన మనమే !! ఎప్పుడంటే ??