Balakrishna: హీరోయిన్ రిసెప్షన్.. బాలయ్య ఫన్నీ మూమెంట్
కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హీరోయిన్గా సినీరంగంలోకి అడుగుపెట్టిన వరలక్ష్మి.. ఆ తర్వాత పవర్ ఫుల్ లేడీ విలన్ గా మారింది. హీరోయిన్ రోల్స్ పక్కన పెట్టి విలన్ పాత్రలతో అదరగొట్టేస్తోంది. ఎలాంటి పాత్రలలోనై తన యాక్టింగ్, మేనరిజంతో మెప్పిస్తుంది. తమిళంలోనే కాకుండా తెలుగులోనూ అనేక సూపర్ హిట్ చిత్రాల్లో కీలకపాత్రలు పోషించింది. తాజాగా వరలక్ష్మి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది.
కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హీరోయిన్గా సినీరంగంలోకి అడుగుపెట్టిన వరలక్ష్మి.. ఆ తర్వాత పవర్ ఫుల్ లేడీ విలన్ గా మారింది. హీరోయిన్ రోల్స్ పక్కన పెట్టి విలన్ పాత్రలతో అదరగొట్టేస్తోంది. ఎలాంటి పాత్రలలోనై తన యాక్టింగ్, మేనరిజంతో మెప్పిస్తుంది. తమిళంలోనే కాకుండా తెలుగులోనూ అనేక సూపర్ హిట్ చిత్రాల్లో కీలకపాత్రలు పోషించింది. తాజాగా వరలక్ష్మి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరిస్ట్ నికోలయ్ సచ్దేవ్ ను వివాహం చేసుకుంది. థాయ్ లాండ్ వేదికగా జూలై 2న వీరి వివాహం జరిగింది. తాజాగా చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయగా.. సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు. టాలీవుడ్, కోలీవుడ్ సినీ నటీనటులు ఈ రిసెప్షన్ లో సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక వరలక్ష్మి శరత్ కుమార్, నికోలయ్ సచ్ దేవ్ రిసెప్షన్ వేడులకు తమిళనాడు సీఎం స్టాలిన్ విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే నందమూరి బాలకృష్ణ, వెంకటేశ్, శోభన, రజినీకాంత్, సిద్ధార్థ్, ఖుష్బూ, మంచి లక్ష్మి, సందీప్ కిషన్ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందులోనూ శోభన, ఖుష్బూ సెల్ఫీలో బాలయ్య వెనక ఫన్నీగా భరత నాట్యం చేస్తున్నట్టు ఫోజ్ ఇవ్వడం నెట్టింట అందర్నీ ఆకట్టుకుంటోది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Manamey: OTT స్ట్రీమింగ్‌కు సిద్దమైన మనమే !! ఎప్పుడంటే ??

ఒకే ఒక్క క్లూతో ట్రావెల్ బ్యాగులో డెడ్బాడీ మిస్టరీ వీడింది వీడియ

రైతు వేషంలో పోలీసులు.. తర్వాత ఏమైదంటే? వీడియో

వార్నీ.. ఇదేం బిజినెస్ రా అయ్యా వీడియో

దృశ్యం సినిమాను తలపించేలా వరుస చోరీలు వీడియో

వామ్మో .. ఎంత పని చేసిందీ కోతి.. రూ. 20 లక్షల విలువైన పర్సు చోరీ

కడుపునొప్పితో ఆస్పత్రికి మహిళ.. టెస్టులు చేయగా..

చేపలు వేటకు వెళ్లిన జాలర్లు.. సముద్రంలో తెలియాడుతున్నది చూసి
