Viral Video: ఆహా ఏం ప్లాన్‌ వేశావ్‌ తల్లీ.. బోయ్‌ ఫ్రెండ్‌ని కలవడానికి ఇంత నాటకమా..! చివరికి బకరా అయింది ఎవరో తెలుసా.

Viral Video: ఆహా ఏం ప్లాన్‌ వేశావ్‌ తల్లీ.. బోయ్‌ ఫ్రెండ్‌ని కలవడానికి ఇంత నాటకమా..! చివరికి బకరా అయింది ఎవరో తెలుసా.

Anil kumar poka

|

Updated on: Apr 10, 2022 | 9:42 AM

ఓ యువతి అర్జంట్‌గా తన బోయ్‌ ఫ్రెండ్‌ని కలవాలనుకుంది. బయటకు వచ్చింది. కానీ ఆ ఏరియాలో ఉబెర్ స్ట్రైక్ న‌డుస్తోంది. ఏం చెయ్యాలా అని ఆలోచించింది. వెంట‌నే టిండ‌ర్ యాప్ గుర్తొచ్చింది. ఇది ఓ డేటింగ్ యాప్‌. ఇందులో త‌మ‌కు కావాల్సిన వాళ్లతో ప‌రిచ‌యం పెంచుకుని,


ఓ యువతి అర్జంట్‌గా తన బోయ్‌ ఫ్రెండ్‌ని కలవాలనుకుంది. బయటకు వచ్చింది. కానీ ఆ ఏరియాలో ఉబెర్ స్ట్రైక్ న‌డుస్తోంది. ఏం చెయ్యాలా అని ఆలోచించింది. వెంట‌నే టిండ‌ర్ యాప్ గుర్తొచ్చింది. ఇది ఓ డేటింగ్ యాప్‌. ఇందులో త‌మ‌కు కావాల్సిన వాళ్లతో ప‌రిచ‌యం పెంచుకుని, వాళ్లకు ఇష్టముంటే డేటింగ్‌కు వెళ్లొచ్చు. ఇంకేం స‌ద‌రు యువ‌తి ఓ అబ్బాయిని లైన్లో పెట్టింది. బ‌య‌ట‌కెళ్దాం రా అని పిలిచింది. దీంతో ఆ యువకుడు కాలరెగరేసుకుంటూ కారేసుకొని వచ్చేశాడు. మేడమ్‌ కారెక్కి ఆ యువకుడితో రైడ్‌కు వెళ్లిపోయింది.కొంత‌దూరం వెళ్లాక తను వెళ్లాల్సిన చోటు రానే వచ్చింది. అంతే.. కారు ఆప‌మ‌ని యువ‌కుడిని కోరింది. అత‌డు వెంట‌నే ఆపాడు. ఇక్కడ చిన్న పనిఉంది.. ఇప్పుడే వచ్చేస్తా అని చెప్పి ఓ ఇంట్లోకి ఆమె వెళ్లిపోయింది. యువ‌తి వ‌స్తుంద‌ని స‌ద‌రు యువ‌కుడు చాలాసేపు వేచిచూశాడు. కానీ, ఎంత‌సేపైనా రాలేదు. ఇక లాభం లేద‌నుకుని వెళ్లి ఆ ఇంటి డోర్‌కొట్టాడు. లోపలినుంచి ఓ పొడవాటి వ్యక్తి బ‌య‌ట‌కు వ‌చ్చి ఆ అమ్మాయి త‌న ఫ్రెండ్‌తో ఉంది..ఇప్పుడే రాలేదు అని చెప్పాడు. అప్పటికిగానీ అర్థం కాలేదు మనోడి.. మోస‌పోయాన‌ని. అయితే సదరు యువతి మర్నాడు సారీ చెప్తూ ఆ యువకుడికి మెసేజ్‌ పెట్టింది.. ఉబెర్ స్ట్రైక్ వ‌ల్లే నీతో డేటింగ్ అంటూ నాట‌కమాడాన‌ని. ఈ విషాద డేటింగ్ క‌థ‌ను స‌ద‌రు యువకుడు సోషల్‌మీడియాలో పంచుకున్నాడు. ఈ క‌థ చ‌దివిన‌వారంతా అయ్యో పాపం అని యువ‌కుడిపై జాలిప‌డుతున్నారు.

మరిన్ని చూడండి ఇక్కడ:
Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..

Chimpanzee video: తగ్గేదే లే..! ఎంజాయ్ మీకే కాదు మాకు ఉంటది.. గేమ్స్‌తో చిల్‌ అవుతున్న చింపు..

Funny Video: అట్లుంటది మనతోని మరి.. ఒంటెతో యువతి సెల్ఫీ.. ఆ ఒంటె ఏంచేసిందో చూస్తే నవ్వాపుకోలేరు..!

Viral Video: ఓరి దేవుడా..! ఒక అబ్బాయి కోసం జుట్లు పట్టుకొని పొట్టు పొట్టుగా కొట్టుకున్న అమ్మాయిలు.. వైరల్ అవుతున్న వీడియో..

Police Dance Viral Video: ఏంటి మేము ఎం అయినా తక్కువ..! కచ్చా బాదం సాంగ్‌కు.. డ్యాన్స్‌ ఇరగదీసిన పోలీసులు.!

Queuing for condoms: కండోమ్స్ కోసం క్యూ కట్టిన జనం.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే !

Viral Video: పిచ్చి వేషాలు వేస్తే అలాగే ఉంటది మరి… ప్రాంక్‌ చేయాలనుకున్నడు.. గూబ పగలకొట్టించుకున్నా