AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ghanaian priest: 12 ఏళ్ల బాలికను పెళ్లాడిన 63 ఏళ్ల పూజారి.! వీడియో వైరల్.

Ghanaian priest: 12 ఏళ్ల బాలికను పెళ్లాడిన 63 ఏళ్ల పూజారి.! వీడియో వైరల్.

Anil kumar poka
|

Updated on: Apr 05, 2024 | 9:58 PM

Share

63 సంవత్సరాల మతబోధకుడు ఒకరు 12 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆఫ్రికాలోని ఘనా దేశం రాజధాని అక్రాలో జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనంగా మారింది. సంప్రదాయ ప్రధాన పూజరి సురు అట్టహాసంగా జరిగిన వేడుకలో బాలికను పెళ్లాడాడు. ఘనాలో అమ్మాయిల చట్టబద్ధ వివాహ వయసు 18 ఏళ్లు కాగా, సురు 12 ఏళ్ల బాలికను వివాహం చేసుకోవడంపై దుమారం రేగింది.

63 సంవత్సరాల మతబోధకుడు ఒకరు 12 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆఫ్రికాలోని ఘనా దేశం రాజధాని అక్రాలో జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనంగా మారింది. సంప్రదాయ ప్రధాన పూజరి సురు అట్టహాసంగా జరిగిన వేడుకలో బాలికను పెళ్లాడాడు. ఘనాలో అమ్మాయిల చట్టబద్ధ వివాహ వయసు 18 ఏళ్లు కాగా, సురు 12 ఏళ్ల బాలికను వివాహం చేసుకోవడంపై దుమారం రేగింది. ఈ వివాహానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైరల్ అవుతున్న వీడియోలో తెల్లని దుస్తులు, అందుకు మ్యాచ్‌ అయ్యే హెడ్‌పీస్ ధరించిన బాలికతో స్థానిక మహిళలు భర్తను ఆటపట్టించే దుస్తులు ధరించమని, భార్య విధులకు సిద్ధంగా ఉండాలని, భర్తకు ఆకర్షణ కలిగించేలా వ్యవహరించాలని చెప్పినట్టు బీబీసీ తెలిపింది. అంతేకాదు, పరిమళ ద్రవ్యాలను కూడా ఉపయోగించాలని వారు ఆ బాలికతో చెప్పారు.

వివాహం ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాక దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. వివాహాన్ని రద్దుచేసి పూజారిని అరెస్టు చేయాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. అయితే, స్థానిక కమ్యూనిటీ ప్రజలు మాత్రం ఈ వివాహాన్ని సమర్థించారు. విమర్శిస్తున్న వారికి తమ ఆచారాలు, సంప్రదాయాలు తెలియవని, అర్థం చేసుకోలేరని స్థానిక సంఘం నాయకుడు పేర్కొన్నారు. పూజారి భార్యగా ఆ బాలిక పూర్తిగా సంప్రదాయం, ఆచారం ప్రకారం నడుచుకుంటుందని వివరించారు. బాలికకు ఆరేళ్ల వయసున్నప్పుడే పూజారి భార్య కావడానికి అవసరమైన ఆచారాలు ప్రారంభమయ్యాయని, అయితే, ఈ ప్రక్రియ ఆమె చదువుకు ఆటంకం కలిగించలేదని చెబుతున్నారు. ఆడపిల్లకు సంతానం కలగడంతోపాటు వైవాహిక బాధ్యతలకు ఆమెను సిద్ధం చేసేందుకు రెండో సంప్రదాయ వేడుకను నిర్వహించేందుకు సిద్ధమవుతుండడం విశేషం. దేశవ్యాప్తంగా ఈ వివాహంపై విమర్శలు వెల్లువెత్తడంతో పోలీసులు రంగంలోకి దిగారు. బాలికను రక్షించి తమ అధీనంలోకి తీసుకున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..