కుక్క మాంసానికి అక్కడ గ్రీన్ సిగ్నల్ !!

|

Jun 10, 2023 | 12:01 PM

కుక్క మాంసం ఎగుమతులు, విక్రయాలపై నాగాలాండ్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని గౌహతి హైకోర్టు కోట్టేసింది. వాణిజ్య అవసరాల కోసం కుక్కల దిగుమతి, వాటితో వర్తకం, రెస్టారెంట్లలో వాణిజ్య ప్రాతిపదిక, వాటి మాంసం విక్రయాలను నిషేధిస్తూ నాగాలాండ్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

కుక్క మాంసం ఎగుమతులు, విక్రయాలపై నాగాలాండ్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని గౌహతి హైకోర్టు కోట్టేసింది. వాణిజ్య అవసరాల కోసం కుక్కల దిగుమతి, వాటితో వర్తకం, రెస్టారెంట్లలో వాణిజ్య ప్రాతిపదిక, వాటి మాంసం విక్రయాలను నిషేధిస్తూ నాగాలాండ్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. నిషేధ ఉత్తర్వులు జారీ చేయడానికి చీఫ్ సెక్రటరీ తగిన వ్యక్తి కాదని చెప్పింది హైకోర్టు. ఈ నిషేధాన్ని 2020 నవంబర్ లోనే సింగిల్ బెంచ్ ధర్మాసనం తాత్కాలికంగా నిలిపివేసింది. ఇదే కేసుపై హైకోర్టు కోహిమా బెంచ్ జస్టిస్ మర్లి వంకున్ ఆధ్వర్యంలోని ధర్మాసనం తీర్పు చెప్పింది. కుక్కల మాంసం విక్రయాల విషయంలో కేబినెట్ నిర్ణయాన్ని కొట్టివేసింది. కోహిమా మున్సిపల్ కౌన్సిల్ పరిధిలో శునకాలతో వ్యాపారం నిర్వహించే లైసెన్స్‌డ్ వర్తకులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేశారు. ఆహార భద్రత చట్టాన్ని తప్పుగా అన్వయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసినట్టు హైకోర్టుకు విన్నవించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గొంతులో కత్తితోనే బైక్‌పై కిలోమీటరు ప్రయాణించి ఆసుపత్రిలో చేరిన ధీశాలి

ఆడవాళ్లా మజాకా !! మెట్రోలో డిష్యూం డిష్యూం !!

రైలు పట్టాలకు రాళ్లు కట్టిన బాలుడు.. తప్పిన పెను ప్రమాదం

మహాప్రభో నాకు పెళ్ళాం కావాలి అంటూ తహసీల్దార్‌కు దరఖాస్తు.. కండిషన్స్ అప్లై..

పేరెంట్స్‌ వెడ్డింగ్‌ వీడియో చూసి ఆ చిన్నారి ఏమన్నాడో తెలుసా ??