ఎన్నికల్లో 'గ్యాస్​' బాయ్ పోటీ..పేదల కోసమే మరోసారి బరిలోకి

ఎన్నికల్లో ‘గ్యాస్​’ బాయ్ పోటీ..పేదల కోసమే మరోసారి బరిలోకి

Phani CH

|

Updated on: Apr 08, 2024 | 9:32 PM

సాటి మనిషికి సహాయ పడాలనే ఆలోచన, పట్టుదల, ఓడినా వెనకడుగు వేయని ఆత్మస్థైర్యం, ఇవన్నీ ఓ సాధారణ గ్యాస్​ డెలివరీ బాయ్​ 20 ఏళ్లుగా ఎన్నికల్లో పోటీ చేయడానికి కారణమయ్యాయి. ఒక్కసారి కూడా గెలవకపోయినా కష్టపడి మళ్లీ మళ్లీ బరిలోకి దిగేలా చేశాయి. దీనికి ఆయన భార్య పశు పోషణ చేస్తూ మద్దతు ఇస్తోంది. బిహార్​లోని కిషన్​గంజ్​కు చెందిన ​ఛోటేలాల్ మహతో గ్యాస్​ డెలివరీ బాయ్​గా పనిచేస్తున్నాడు. ఆయన గ్యాస్​ డెలివరీ చేస్తూనే, నిస్సహాయులకు సహాయం చేసేవాడు.

సాటి మనిషికి సహాయ పడాలనే ఆలోచన, పట్టుదల, ఓడినా వెనకడుగు వేయని ఆత్మస్థైర్యం, ఇవన్నీ ఓ సాధారణ గ్యాస్​ డెలివరీ బాయ్​ 20 ఏళ్లుగా ఎన్నికల్లో పోటీ చేయడానికి కారణమయ్యాయి. ఒక్కసారి కూడా గెలవకపోయినా కష్టపడి మళ్లీ మళ్లీ బరిలోకి దిగేలా చేశాయి. దీనికి ఆయన భార్య పశు పోషణ చేస్తూ మద్దతు ఇస్తోంది. బిహార్​లోని కిషన్​గంజ్​కు చెందిన ​ఛోటేలాల్ మహతో గ్యాస్​ డెలివరీ బాయ్​గా పనిచేస్తున్నాడు. ఆయన గ్యాస్​ డెలివరీ చేస్తూనే, నిస్సహాయులకు సహాయం చేసేవాడు. ఛోటేలాల్​లోని సేవా గుణాన్ని గమనించిన స్థానికులు ఎన్నికల్లో పోటీ చేయాలని సలహా ఇచ్చారు. దీంతో 2000వ సంవత్సరంలో మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు ఛోటేలాల్​కు 23 ఏళ్ల వయసే. అయితే వయసు తక్కువగా ఉండటం వల్ల నామినేషన్​ రద్దు చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తేనె ఎప్పుడు తీసుకోవాలో తెలుసా ?? ఆ సమయంలో సేవిస్తే తిరుగుండదట