కియా కారులో వచ్చి పట్టపగలు చోరీ.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా ??
దేశ రాజధాని ఢిల్లీ శివారులోని గురుగ్రామ్‌లో జరుగుతున్న జీ20 సదస్సులో అలంకరణ కోసం తీసుకొచ్చిన పూల కుండీల మాయమయ్యాయి. దీన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు..
దేశ రాజధాని ఢిల్లీ శివారులోని గురుగ్రామ్‌లో జరుగుతున్న జీ20 సదస్సులో అలంకరణ కోసం తీసుకొచ్చిన పూల కుండీల మాయమయ్యాయి. దీన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ఇద్దరి అదుపులోకి తీసుకున్నారు. వీరు చోరీ చేసిన తీరును చూసి పోలీసులు షాక్ అయ్యారు. దర్జాగా వీఐపీ లైసెన్స్ ప్లేట్ ఉన్న అధునాతన వాహనంలో వచ్చిన దొంగలు.. పట్టపగలు చోరీకి పాల్పడ్డారు. ఇద్దరు వ్యక్తులు పూల కుండీలను తీసుకొని వారి లగ్జరీ కారు ట్రంక్‌లో పెట్టుకుంటున్న వీడియోలో వైరల్‌గా మారింది. G20 సమ్మిట్ పోస్టర్‌తో పాటు, ఆ ప్రాంతంలో రంగురంగుల పూల కుండీలు కూడా తస్కరించారు. శంకర్ చౌక్‌లో జరిగిన G20 ఈవెంట్ ప్రాంగణంలో ఇద్దరు వ్యక్తులు పూల కుండీలను దొంగిలించిన వీడియోను జర్నలిస్ట్ ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో వీడియో కాస్త సోషల్ మీడియా వేదికగా అందరి దృష్టిని ఆకర్షించింది. చాలా మంది ఈ వీడియోని షేర్ చేస్తూ పోయారు. ఇది కాస్తా పోలీసుల దృష్టికి వెళ్లడంతో దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విధి నిర్వహణలో ప్రాణాల్ని కూడా లెక్కచేయని ఆర్టీసీ డ్రైవర్
టీడీపీ జెండాతో సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి..
వారెవా.. లిటిల్ జీనియస్ రూబిక్ క్యూబ్ ఆర్ట్‌తో రికార్డులు
మందుకు డబ్బుల్లేక.. ఆర్టీసీ బస్ కాజేశాడు.. మహానుభావుడు
మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పని.. చావు దాకా వెళ్లిన చిన్నారులు
లిఫ్ట్ ఓపెన్.. మంగళసూత్రం ఖతం !!
అద్భుతం.. సాగర గర్భంలో త్రివర్ణపతాక ధగధగలు

