ఎక్కడున్నా నచ్చిన వారిని ఈజీగా లిప్‌కిస్ పెట్టేయండిలా..
మీరు మీ భాగస్వామిని మిస్ అవుతున్నారా? భాగస్వామి నుంచి దూరాన్ని తట్టుకోలేకపోతున్నారా? మీ రిలేషన్‌షిప్‌లో ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతున్నట్లయితే, ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
మీరు మీ భాగస్వామిని మిస్ అవుతున్నారా? భాగస్వామి నుంచి దూరాన్ని తట్టుకోలేకపోతున్నారా? మీ రిలేషన్‌షిప్‌లో ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతున్నట్లయితే, ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అలాంటి వారికి చైనా ఓ శుభవార్త అందించింది. చైనాకు చెందిన చాంగ్‌జౌ యూనివర్సిటీ ఓ అద్భుతమైన ప్రయోగం చేసి ఓ రిమోట్‌ను తయారు చేసింది. అదే కిస్సింగ్ రోబోట్. అదేనండీ తెలుగులో ముద్దుల రోబోట్ అంట. కేవలం ముద్దుల కోసమే రిమోట్‌ను తయారు చేసినట్లు ఆ సంస్థ పేర్కొంది. మీ భాగస్వామి మీకు దూరంగా ఉంటే, మీరు ఈ రిమోట్‌ని ఉపయోగించి ఇంటర్నెట్ ద్వారా మీ భాగస్వామిని ముద్దు పెట్టుకోవచ్చంట. ఒక జంట సన్నిహితంగా ఉండటానికి ఈ సుదూర కిస్సింగ్ రోబోట్‌ను ఉపయోగించవచ్చు. ఈ కిస్సింగ్ రోబోట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: