VIRAL DANCE: ఒళ్లంతా గాయాలు.. మెడలో సెలైన్ బాటిల్..  అయినా పెళ్లి బరాత్‌లో సూపర్‌ డ్యాన్స్‌.! వైరల్ అవుతున్న వీడియో..

VIRAL DANCE: ఒళ్లంతా గాయాలు.. మెడలో సెలైన్ బాటిల్.. అయినా పెళ్లి బరాత్‌లో సూపర్‌ డ్యాన్స్‌.! వైరల్ అవుతున్న వీడియో..

Anil kumar poka

|

Updated on: Dec 06, 2021 | 10:56 AM

సోషల్ మీడియా అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో చాలా వరకు ఫన్నీ వీడియోలే ఉంటాయి. ఇక తాజాగా అలాంటి ఫన్నీ వీడియోనే ఒకటి నెట్టింట్లో తెగ రచ్చ చేస్తుంది. పెళ్లి వేడుకలో బరాత్ నిర్వహించడం...


సోషల్ మీడియా అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో చాలా వరకు ఫన్నీ వీడియోలే ఉంటాయి. ఇక తాజాగా అలాంటి ఫన్నీ వీడియోనే ఒకటి నెట్టింట్లో తెగ రచ్చ చేస్తుంది. పెళ్లి వేడుకలో బరాత్ నిర్వహించడం, డ్యాన్స్‌లు చేయడమూ కామన్. అయితే, కాలికో, చేతికో చిన్న గాయాలు అయితేనే బెడ్‌ మీద నుంచి కిందకు దిగని పరిస్థితి ఉంటుంది. అలాంటి ఓ వ్యక్తి ఒళ్లంతా రక్తపు గాయాలతో, బ్యాండేజీలు వేసుకుని, మెడలో సెలైన్ బాటిల్ పెట్టుకు మరీ బరాత్‌లో డ్యాన్స్ కుమ్మేశాడు. పెళ్లి బరాత్‌లో పెట్టిన డీజే పాటలకు మహిళలు, యువకులు డ్యాన్స్ చేస్తున్నారు. అందరూ కొత్త దుస్తులు ధరించి.. గ్రాండ్‌గా కనిపిస్తూ డ్యాన్స్ చేస్తుంటే.. ఒక వ్యక్తి అందరి అటెన్షన్‌ను తనవైపు తిప్పేసుకున్నాడు. తలకు తీవ్రగాయాలు, ఒళ్లంతా బ్యాండేజీలు, సెలైన్‌ బాటిల్‌ను మెడలో వేసుకుని చేతిలో ఓ సపోర్ట్‌ స్టిక్‌ను పట్టుకుని బరాత్‌లోకి వచ్చాడు. ఇక ఆ డీజే పాటలు మోగుతుంటే.. అతని ఓ రేంజ్‌లో కాలు కదుపుతూ.. మాస్ డ్యాన్స్‌తో ఇరగదీశాడు. ఇక అతగాడి డ్యాన్స్‌ చూసి, చుట్టు పక్కన వారు షాక్ అయ్యారు. అన్ని గాయాలు ఉన్న ఆ రేంజ్‌లో డ్యాన్స్ ఎలా వేశాడా? అని ఆశ్చర్యపోయారు.

Published on: Dec 06, 2021 10:56 AM