Bob Moore: ఉద్యోగులకే తన కంపెనీ బాబ్స్‌ రెడ్‌ మిల్‌ ని ఇచ్చేసిన పెద్దాయన ఇక లేరు.!

Bob Moore: ఉద్యోగులకే తన కంపెనీ బాబ్స్‌ రెడ్‌ మిల్‌ ని ఇచ్చేసిన పెద్దాయన ఇక లేరు.!

Anil kumar poka

|

Updated on: Feb 24, 2024 | 3:39 PM

ఒక సంస్థ లాభాల బాట పట్టిందంటే సాధారణంగా ఉద్యోగులకు జీతాలు పెంచడం, బోనస్‌ ప్రకటించడం చేస్తుంది. కానీ అమెరికాలో ఒక మిలియనీర్‌ మాత్రం 700 మంది ఉద్యోగులకు ఏకంగా తన కంపెనీ యాజమాన్య బాధ్యతలే అప్పగించాడు. వారికీ సంస్థపై హక్కులు కల్పించిన ‘బాబ్స్‌ రెడ్‌ మిల్‌’ వ్యవస్థాపకుడు బాబ్‌ మూర్‌ 94 ఏళ్ల వయసులో కన్నుమూశారు. మూర్‌ తన సంస్థను 1978లో నెలకొల్పారు. ఇది చిరుధాన్యాల నాణ్యమైన ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందింది.

ఒక సంస్థ లాభాల బాట పట్టిందంటే సాధారణంగా ఉద్యోగులకు జీతాలు పెంచడం, బోనస్‌ ప్రకటించడం చేస్తుంది. కానీ అమెరికాలో ఒక మిలియనీర్‌ మాత్రం 700 మంది ఉద్యోగులకు ఏకంగా తన కంపెనీ యాజమాన్య బాధ్యతలే అప్పగించాడు. వారికీ సంస్థపై హక్కులు కల్పించిన ‘బాబ్స్‌ రెడ్‌ మిల్‌’ వ్యవస్థాపకుడు బాబ్‌ మూర్‌ 94 ఏళ్ల వయసులో కన్నుమూశారు. మూర్‌ తన సంస్థను 1978లో నెలకొల్పారు. ఇది చిరుధాన్యాల నాణ్యమైన ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందింది. మూర్‌ తన కృషితో కంపెనీని ఉన్నత స్థాయిలో నిలిపారు. దానిలో తన ఉద్యోగుల పాత్ర గురించి ఉన్నతంగా ఆలోచించారు. తన కంపెనీలో వారికి యాజమాన్యం ఇవ్వాలనుకున్నారు. 2010లో తన 81 పుట్టినరోజు సందర్భంగా నాటి 209 మంది ఉద్యోగులకు యాజమాన్య వాటాలను కేటాయించారు. అప్పటికే మూర్‌ యాజమాన్యం నుంచి వైదొలిగారు కూడా. ప్రస్తుతం 700 మంది ఉద్యోగులు ఉన్నారు. దీంతో ఇది పూర్తిగా ఉద్యోగుల కంపెనీగా మారిపోయింది.

ఒక కంపెనీ ఉద్యోగుల కంటే లాభాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే సంప్రదాయాన్ని నివారించడమే తన ఉద్దేశమని బాబ్స్‌ ఒకానొక సందర్భంలో తెలిపారు. సంస్థను విక్రయించమని చాలా మంది తనను కలిశారనీ తన నిర్ణయాన్ని చెబితే అవహేళన చేశారనీ అన్నారు. విజయం సాధించేందుకు కృషితో పాటు తమ కోసం పనిచేసే వారి పట్ల దయతో మెలగడం కూడా ముఖ్యం. అందుకే సంస్థ లాభాల బాట పట్టిన వెంటనే ఉద్యోగుల కోసం నిర్ణయం తీసుకున్నాననీ చెప్పారు. తన దగ్గర ఎంతో డబ్బు ఉందనీ దాన్ని వృథాగా ఖర్చు చేయకుండా.. మంచి లక్ష్యాన్ని చేరేందుకు వినియోగిస్తున్నానని మూర్‌ గతంలో తెలిపారు. ఫోర్బ్స్‌ అంచనా ప్రకారం.. బాబ్స్‌ రెడ్‌ మిల్‌ ఆదాయం 2018 నాటికి 100 మిలియన్‌ డాలర్లు. ప్రస్తుతం 70 కంటే ఎక్కువ దేశాల్లో 200లకి పైగా ఉత్పత్తులను విక్రయిస్తోంది. ఫిబ్రవరి 10న మూర్‌ కన్నుమూశారని కంపెనీ ఇటీవల ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆయన మృతి పట్ల ఉద్యోగులంతా సంతాపం ప్రకటించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..