UAE Floods: ఎడారి రాజ్యంలో వరదల బీభత్సం.. వీడియోలు చూస్తే మీ కళ్ళను మీరే నమ్మలేరు..

UAE Floods: ఎడారి రాజ్యంలో వరదల బీభత్సం.. వీడియోలు చూస్తే మీ కళ్ళను మీరే నమ్మలేరు..

Anil kumar poka

|

Updated on: Aug 10, 2022 | 8:59 PM

ఎడారి రాజ్యంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భారీ వర్షంతో అతలాకుతలమైపోయింది. యూఏఈలోని షార్జా, ఫుజారియా నగరాల్లో వరద పోటెత్తింది..


ఎడారి రాజ్యంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భారీ వర్షంతో అతలాకుతలమైపోయింది. యూఏఈలోని షార్జా, ఫుజారియా నగరాల్లో వరద పోటెత్తింది. కార్లు బొమ్మల్లా తెలియాడుతూ.. నీళ్లల్లో కొట్టుకుపోయాయి. వరదజోరుకు షాపులకున్న అద్దాలు పగిలిపోయాయి. ఈ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ రెండు నగరాల్లో పలువురిని కాపాడారు. వరదల నుంచి కాపాడుకునేందుకు చాలా మంది హోటల్స్‌ను ఆశ్రయించారు. కాగా దుబాయి, అబుదాబి నగరాల్లో మాత్రం వర్షపాతం తక్కువగా నమోదైంది.ఈ వరదల ధాటికి ఇప్పటివరకు ఏడుగురు ప్రవాసులు మరణించినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దంటూ అధికారులు ప్రకటించారు. 27 ఏళ్ల తర్వాత అత్యధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. పాకిస్తాన్‌ వాయువ్య ప్రాంతంలోని బలూచిస్తాన్‌- భీకర వరదలతో అల్లాడిపోయింది. వరదల కారణంగా ఇప్పటివరకు 111 మంది చనిపోయారు. వేలల్లోపలు జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పెద్దసంఖ్యలో మహిళలు, చిన్నారులు వరదలో చిక్కుకుపోయారు. బలూచిస్తాన్‌ను సింధ్‌తో కలిపే వంతెనతో సహా అనేక రోడ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. క్వెట్టా-కరాచీ నగరాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
ఇటు ఇరాన్‌ను కూడా ఆకస్మిక వరదలు అతలాకుతలం చేశాయి.. వరదల్లో చిక్కి 8 మంది మరణించారు.. మరో 19 మంది గల్లంతయ్యారు. కొండచరియలు విరిగి పడటంతో ఓ గ్రామం మొత్తం బురదలో కూరుకుపోయింది. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఇరాన్‌లోని 18 ప్రావిన్స్‌ మీద తీవ్ర ప్రభావాన్నిచూపించాయి. ఇరాన్‌ ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టింది. వరదల్లో చిక్కిన 500 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్‌.. సూపర్‌ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..

Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..

Published on: Aug 10, 2022 08:59 PM