AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fake Death: దాని కోసం పాతిపెట్టిన మృతదేహాన్నే దొంగిలించాడు.. కట్ చేస్తే సీన్ రివర్స్.!

Fake Death: దాని కోసం పాతిపెట్టిన మృతదేహాన్నే దొంగిలించాడు.. కట్ చేస్తే సీన్ రివర్స్.!

Anil kumar poka
|

Updated on: Feb 03, 2024 | 4:33 PM

Share

అప్పుల ఊబిలో కూరుకుపోయాడు.. వాటిని తీర్చడానికి తాను చనిపోయినట్లు ఓ చిత్రమే తీసేంత స్థాయిలో స్కెచ్ వేశాడు. బీమా సొమ్ము కోసం చనిపోయినట్లు నమ్మించాలని అనుకున్నాడు. పథకం బెడిసికొట్టి పోలీసులకు అడ్డంగా దొరికాడు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వీరంపాలెంలో ఈ నెల 26న గుర్తుతెలియని వ్యక్తి మృతి కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు.

అప్పుల ఊబిలో కూరుకుపోయాడు.. వాటిని తీర్చడానికి తాను చనిపోయినట్లు ఓ చిత్రమే తీసేంత స్థాయిలో స్కెచ్ వేశాడు. బీమా సొమ్ము కోసం చనిపోయినట్లు నమ్మించాలని అనుకున్నాడు. పథకం బెడిసికొట్టి పోలీసులకు అడ్డంగా దొరికాడు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వీరంపాలెంలో ఈ నెల 26న గుర్తుతెలియని వ్యక్తి మృతి కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం. కేతమళ్ల వెంకటేశ్వరరావు అలియాస్‌ పూసయ్య వీరంపాలెంలో ధాన్యం వ్యాపారి. వివిధ అవసరాలకు తీర్చలేనన్ని అప్పులు చేసాడు. దీంతో ఓ ప్లాన్ రచించాడు.. చనిపోయినట్టు చిత్రీకరించుకుని కొన్నాళ్లు అజ్ఞాతంలోకి వెళితే తన పేరిట కోటి రూపాయల బీమా సొమ్ము వస్తుందని భావించాడు. ప్రమాదవశాత్తు మరణించినట్టు అందరినీ నమ్మించడానికి ప్రణాళిక రూపొందించాడు. అతడి స్థానంలో వేరే మృతదేహాన్ని ఉంచి ఎవరూ గుర్తించకుండా చేయాలని భావించాడు. ఆ తర్వాత గుర్తుతెలియని మృతదేహం కోసం రాజమహేంద్రవరం గ్రామీణం మోరంపూడికి చెందిన ఇద్దరు యువకులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.

పాత బొమ్మూరులో ఈ నెల 23న ఓఎన్జీసీ ఇంజినీర్ నెల్లి విజయరాజు అనే వ్యక్తి మరణించారు. కుటుంబీకులు మరుసటిరోజు స్థానిక శ్మశానవాటికలో మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. విషయం తెలుసుకున్న ఇద్దరు యువకులూ పూడ్చిపెట్టిన శవపేటిక నుంచి విజయరాజు మృతదేహాన్ని దొంగిలించి, వీరయ్య చెప్పిన ప్రకారం.. వీరంపాలెం తీసుకెళ్లి ఓ పొలంలోని ట్రాన్స్ ఫార్మర్ వద్ద పెట్రోలు పోసి తగలబెట్టారు. పూసయ్య పాదరక్షలు, సెల్ఫోన్ను అక్కడే విడిచి పెట్టి పరారయ్యారు. అక్కడ లభించిన ఆధారాలను బట్టి మృతదేహం పూసయ్యదేనని గ్రామస్థులు భావించి పోస్టుమార్టం కోసం తరలించారు. పోస్టుమార్టం రిపోర్టులో డెడ్‌బాడీ పూసయ్యది కాదని తేలడంతో పోలీసులు తమదైనశైలిలో దర్యాప్తు చేపట్టారు. స్థానిక పరిస్థితులను యువకులిద్దరూ పూసయ్యకు ఎప్పటికప్పుడు ఫోన్లో చెప్పేవారు. ఈ క్రమంలో పూసలయ్య, అతనికి సహకరించిన ఇద్దరు యువకులును అదుపులోకి తీసుకున్నారు. గుర్తుతెలియని యువకులు ఎవరో పొలంలో ఓ మృతదేహాన్ని కాలుస్తుండగా తాను అడ్డుకున్నానని, దీంతో వారు తనను కొట్టి ఆటోలో తీసుకెళ్లి దూరంగా తుప్పల్లో పడేసినట్టు పూసయ్య మరోకథ చెప్పుకొచ్చాడు. అయితే, అతడి శరీరంపై గాయాలు లేకపోవడం అనుమానాలకు తావిచ్చింది. దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం చెప్పాడు. పూసయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అనపర్తి సీఐ శివగణేష్, స్థానిక డిఎస్పి వివరాలను వెల్లడించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos