లోకల్ బాయ్‌ నానీ అరెస్ట్‌.. ఈజీ మనీకి బెట్టింగ్‌ యాప్‌ ఇన్‌ఫ్లూయెన్సర్లు వీడియో

Updated on: Feb 28, 2025 | 2:25 PM

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు కొందరు యువత పాలిట ఉరితాళ్లుగా మారుతున్నాయి. సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో చాలా మంది ఈ జూదం ఉచ్చులో కూరుకుపోయి, చివరకు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌ ఆటలను నిషేధిస్తూ 2017లోనే చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం ఆన్‌లైన్లో జూదం నిర్వహించడం, ఆడటం కూడా నేరం. నిఘా వైఫల్యమో ఏమో తెలియదు కాని రాష్ట్రంలో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌లు ప్రస్తుతం పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. జోరుగానే జూదం కీడ్రలు సాగుతున్నాయి. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు అలవాటు పడ్డ చాలమంది యువత తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన సొమ్మును ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ రాయుళ్ల ఖాతాలకు పంపిస్తున్నారు. అక్రమ పద్దతిలో నడుస్తున్న ఈ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ గేమ్‌లలో నిర్వాహకులు ఏఐ సహకారాన్ని తీసుకుంటూ కోట్ల రూపాయల వ్యాపారాన్ని చేస్తున్నట్లు సమాచారం.

అమాయకులకు వల వేసి భారీగా సంపాదిస్తున్న ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ రాయుళ్లు ఈ గేమ్స్‌ను ప్రమోట్‌ చేయడానికి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ను వాడుకుంటున్నారు. అందుకోసం భారీగానే ఖర్చు చేస్తున్నారు. రమ్మీ లాంటి ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లలో పెట్టుబడులు పెట్టి మోసపోయిన వారు ఆ షాక్‌ నుంచి కోలుకోక, బయట మొఖం చూపించలేక బలవన్మరణాలకు పాల్పడ్ఢ ఘటనలు తరచూ జరుగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మోహన్‌ అరవింద్‌ కుమార్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో 2 లక్షల రూపాయలు పోగొట్టుకుని మాదాపూర్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆన్‌లైన్‌ రమ్మీ, ఇతర గ్యాంబ్లింగ్‌ ఆటల్లోకి కస్టమర్లను ఆకర్షించేందుకు వివిధ వెబ్‌సైట్లు ఇంటర్‌నెట్‌లో భారీ ప్రకటనలిస్తుంటాయి. దానికి తోడు తమ వెబ్‌సైట్లో సభ్యత్వం తీసుకుంటే బంపర్‌ ఆఫరిస్తామంటూ బుట్టలో పడేస్తున్నారు. ఆట ప్రారంభంలో డబ్బులు ఇచ్చినట్లే చేసి, ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌ ఆటపై వినియోగదారులకు మోజు పెంచుతున్నారు. ఇది వ్యసనంగా మారడంతో ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌ ఆటల నుంచి బయటకు రాని పరిస్ధితిలో చాలా మంది ఉంటున్నారు. ఏ సభ్యుడు రోజు ఎంత సేపు ఆడుతున్నాడనే విషయాన్ని గుర్తిస్తూ, ఆన్‌లైన్‌ సైట్‌ నిర్వాహకులు వారి దృష్టంతా ఆటపై ఉండేందుకు జిమ్మిక్కులు చేస్తుంటారు.

మరిన్ని వీడియోల కోసం :

బర్డ్ ఫ్లూ భయం.. అయినా ఫ్రీ చికెన్ కోసం ఎగబడిన జనం వీడియో

డెస్క్‌కు చీమిడి రుద్దిన ఎలాన్ మస్క్ కొడుకు.. అది చూసిన ట్రంప్ ఏం చేశాడంటే! వీడియో

ఆ ఫోటోను చూస్తే కోతులకు ఎందుకంత భయం? వీడియో

నాటు నాటు పాటకు అఖిల్ స్టెప్పులు.. చివరిలో సూపర్‌ ట్విస్ట్..వీడియో