Viral Video: అగ్నిపర్వతం నుంచి ఉవ్వెత్తున ఎగసిపడిన లావా.. డ్రోన్‌తో వీడియో చిత్రీకరణ.. అంతలోనే షాకింగ్ ఘటన..

Drone Ccrashes into Volcano: బద్దలైన అగ్నిపర్వతం దృశ్యాలను, లావా ప్రవాహాన్ని వీడియో తీసేందుకు ప్రయత్నించిన ఓ యూట్యూబర్...

Viral Video: అగ్నిపర్వతం నుంచి ఉవ్వెత్తున ఎగసిపడిన లావా.. డ్రోన్‌తో వీడియో చిత్రీకరణ.. అంతలోనే షాకింగ్ ఘటన..
Viral Video

Updated on: Jun 02, 2021 | 9:55 AM

Drone Ccrashes into Volcano: బద్దలైన అగ్నిపర్వతం దృశ్యాలను, లావా ప్రవాహాన్ని వీడియో తీసేందుకు ప్రయత్నించిన ఓ యూట్యూబర్ తన అత్యాధునిక డ్రోన్ కెమెరాను కోల్పోయాడు. ఆ డ్రోన్ కెమెరా లావాకు ఆహుతి అయ్యింది. అయితే, లావా ప్రవాహ ఉధృతి వీడియో మాత్రం లభించింది. ఈ వీడియో చూడటానికి ఎంతో అద్భుతంగా ఉంది.

ఇంతకీ ఏం జరిగిందంటే.. యూట్యూబర్, డ్రోన్ ఆపరేపరేటర్ జోయ్ హెల్మ్స్.. విస్పోటనం చెందుతున్న అగ్నిపర్వతాన్ని సరికొత్త డిజేఐ ఎఫ్‌పివి డ్రోన్‌తో వీడియో తీయాలని భావించాడు. ఈ క్రమంలో విస్పోటనం చెందిన అగ్ని పర్వతాన్ని, లావా ప్రవాహాన్ని డ్రోన్ ద్వారా వీడియో తీశాడు. ముందుగా అగ్ని పర్వతం పాదాల నుంచి లావా ప్రవాహాన్ని వీడియో తీస్తూ వెళ్లాడు. డ్రోన్ అగ్నిపర్వతం కాల్డెరా ప్రాంతానికి చేరుకోగానే.. లావా భారీ స్థాయిలో ఎగసి పడి డ్రోన్‌పై పడింది. ఆ గరిష్ఠ ఉష్ణోగ్రతలకు ఆ డ్రోన్ కరిగిపోయి అగ్నిపర్వతం కాల్డెరాలో పడిపోయింది. అయితే, వీడియో మాత్రం రికార్డ్ అయ్యింది. అగ్నిపర్వత పాద ప్రాంతం మొదలు.. కాల్డెరా వరకు ఉన్న వీడియో ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ఐస్‌లాండ్‌లోని గెల్డింగ్‌దాలిర్ లోయలోని ఫాగ్రడాల్స్‌ఫాల్ అగ్నిపర్వతం మార్చి 19, 2021న విస్పోటనం చెందింది. అప్పటి నుంచి ఆ అగ్నిపర్వతం లావాను విరజిమ్ముతూనే ఉంది. అయితే, దీనిని వీడియో చిత్రీకరించాలని జోయ్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో తన డ్రోన్‌ను కోల్పోయాడు. అయినప్పటికీ వీడియో ఫుటేజీ లభించడంతో తాను సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. అగ్నపర్వతం నుంచి లావా విడుదల అవుతున్న తీరు అద్భుతంగా ఉందని ఆనందం వ్యక్తం చేశాడు. జోయ్ ఈ వీడియోను మే 26, 2021న యూట్యూబ్‌లో పోస్ట్ చేయగా.. ఇప్పటి వరకు 1,50,664 పైగా వ్యూస్ వచ్చాయి.

ఇదిలాఉంటే.. అంతకుముందు ఫాగ్రడాల్స్‌ఫాల్ అగ్నిపర్వతం విస్పోటనం చెందుతున్న విధానాన్ని జార్న్ స్టెయిన్బెక్ డ్రోన్ కెమెరాతో చిత్రించాడు. దానికి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వీడియోకు విపరీతమైన క్రేజ్ వస్తోంది. యూట్యూబ్ సహా అనేక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఈ వీడియో ట్రెండింగ్‌లో ఉంది.

Viral Video:

Also read:

లెక్క మారింది వరల్డ్‌ కప్‌లో 14 జట్లు.. టీ20 కప్‌లో 20 జట్లు…ఫ్యూచర్ ప్లాన్ ప్రకటించిన ఐసీసీ..