Dog marriage: బ్యాండ్ బాజాలతో ఘనంగా కుక్కలపెళ్లి.. భారీగా విందు ఏర్పాట్లు.!
బీహార్‌లోని మోతిహారిలోని మజురాహా అనే ఓ గ్రామంలో కుక్క వివాహం గ్రాండ్‌గా జరిగింది. అదేంటి కుక్కల పెళ్లినా..? అన్న డౌట్ రావొచ్చు..
బీహార్‌లోని మోతిహారిలోని మజురాహా అనే ఓ గ్రామంలో కుక్క వివాహం గ్రాండ్‌గా జరిగింది. అదేంటి కుక్కల పెళ్లినా..? అన్న డౌట్ రావొచ్చు.. అవును మీరు విన్నది నిజమే.. ఈ కుక్కల వివాహంపై ఇప్పుడు ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశమైంది.మోతిహరి జిల్లా మజురాహా గ్రామంలో నివసిస్తున్న ఓ కుక్క యజమాని పేరు నరేష్ సాహ్ని కాగా మరో కుక్క యజమానురాలు సబితా దేవి. వీరిద్దరూ తమ రెండు కుక్కలకు ఘనంగా పెళ్లి చేయాలని చేయాలని నిర్ణయించుకున్నారు. పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపేందుకు బ్యాండ్ బాజా, డీజే ఏర్పాట్లు చేశారు. దీంతో పాటు వివాహానికి హాజరైన వారికి భారీ విందు కూడా ఏర్పాటు చేశారు. కుక్కలను ఊరేగిస్తూ.. పెళ్లి వేదిక వద్దకు తీసుకుని వస్తున్న సమయంలో హాజరైన జనం ఓ రేంజ్‌లో డ్యాన్స్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..