నొప్పితో ఆస్పత్రికెళ్లిన వ్యక్తి.. స్కాన్ చేసిన డాక్టర్ షాక్ !!
అన్నమయ్య జిల్లాలో అరుదైన ఘటన జరిగింది. మదనపల్లె మండలానికి చెందిన ఓ వృద్ధుడి మూత్రపిండం నుంచి 3 వేల రాళ్లు బయటపడ్డాయి.
అన్నమయ్య జిల్లాలో అరుదైన ఘటన జరిగింది. మదనపల్లె మండలానికి చెందిన ఓ వృద్ధుడి మూత్రపిండం నుంచి 3 వేల రాళ్లు బయటపడ్డాయి. సర్జరీ చేసి ఆ రాళ్లను తొలగించినట్లు యూరాలజీ డాక్టర్ వివరించారు. ఇంత పెద్దమొత్తంలో రాళ్లు బయటపడటం అరుదని తెలిపారు. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని.. కోలుకుంటున్నారని వైద్యులు చెప్పారు. మదనపల్లె మండలానికి చెందిన ఓ వృద్ధుడు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ స్థానికంగా ఉన్న ఆద్య ఆస్పత్రిలో చేరాడు. స్కానింగ్ చేసిన వైద్యులు.. కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వృద్ధుడికి శస్త్ర చికిత్స చేసిన వైద్యులు.. కిడ్నీలోని రాళ్లును తొలగించారు. దాదాపు 3వేల రాళ్లు బయటకు తీశారు వైద్యులు. కీహోల్ సర్జరీ ద్వారా కిడ్నీ స్టోన్స్‌ని తొలగించినట్లు డాక్టర్ సనత్ రెడ్డి తెలిపారు. కలుషిత నీరు.. అవగాహన లోపంతో మూత్రపిండాల వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కన్నతల్లిపై ప్రేమను చాటుకున్న కృష్ణకుమార్.. ఉద్యోగం మానేసి.. ఏం చేసాడంటే ??
ప్రౌడ్ మూమెంట్.. ఒకే వేదికపై మోదీ – చెర్రీ
AR Rahman: అర్హతలేని సినిమాలే ఆస్కార్‌కా !! రెహ్మాన్ అసహనం !!
RRR ఆస్కార్ గెలవడంపై బాలీవుడ్ సెలబ్రిటీ బలుపు మాటలు
Rana Naidu: బూతులన్నవి వదిలేస్తే.. వెంకీ మామ రికార్డుకొట్టారు..