Viral Video: ఫుల్‌గా తప్ప తాగి పెళ్లిలో నిద్రపోయిన వరుడు.. నెక్స్ట్ సీన్ సితారనే..
పెళ్లవుతున్న సంతోషమో లేకపోతే పెళ్లి రద్దు కావాలన్న కోరికో తెలియదు కానీ ఓ పెళ్లి కొడుకు మాత్రం తప్పతాగి పెళ్లికి వచ్చాడు. ఇది చూసిన బంధువులు అంతా షాక్ అయ్యారు. చివరకు ఎలాగొలా పెళ్లి చేయాలనుకున్నా కూడా మద్యం మత్తులో
పెళ్లవుతున్న సంతోషమో లేకపోతే పెళ్లి రద్దు కావాలన్న కోరికో తెలియదు కానీ ఓ పెళ్లి కొడుకు మాత్రం తప్పతాగి పెళ్లికి వచ్చాడు. ఇది చూసిన బంధువులు అంతా షాక్ అయ్యారు. చివరకు ఎలాగొలా పెళ్లి చేయాలనుకున్నా కూడా మద్యం మత్తులో ఉన్న పెళ్లికొడుకు సహకరించలేదు. పెళ్లి మంటపంలోనే పడుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది. పెళ్లి కొడుకు చేసిన ఫీట్లకు నెటిజెన్లు పడిపడి నవ్వుకుంటున్నారు. తప్పతాగి వచ్చిన పెళ్లి కొడుకు పేరు ప్రసేన్ జిత్ హలోయ్. అస్సాం రాష్ట్రం నల్బరి పట్టణ నివాసిగా గుర్తించారు. వైరల్ అవుతున్న వీడియోలో పెళ్లి కొడుకును పీటలపై కూర్చోబెట్టి వివాహం చేద్దాం అని ఎంతగా ప్రయత్నించినా కూడా కుదరలేదు. వివాహ మంత్రాలు చదువుతున్న సమయంలో పెళ్లికొడుకు నేలపై పడుకున్నాడు.చేసేదేం లేక వధువు పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. కనీసం వరుడు కారు నుంచి కూడా దిగలేకపోయాడని, అతడి తండ్రి కూడా మద్యం మత్తులో ఉన్నాడని వధువు బంధువులు ఆరోపించారు. ఈ ఘటన తర్వాత పెళ్లి రద్దుకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ వధువు కుటుంబం నల్బరీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Naatu Naatu Song in Oscar 2023: వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్ ఫీవర్.. ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా..
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్

