భక్తిపారవశ్యం.. వీళ్లు ఏం చేశారో చూస్తే ఒళ్లు జలదరిస్తుంది
దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు అంగరంగవైభవంగా కొనసాగుతున్నాయి. శరన్నవరాత్రుల్లో తొమ్మిదవరోజు అమ్మవారు మహిషాసురమర్ధిని, మహాకాళి, సిద్ధిధాత్రి రూపంలో భక్తులను అనుగ్రహించారు.
దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు అంగరంగవైభవంగా కొనసాగుతున్నాయి. శరన్నవరాత్రుల్లో తొమ్మిదవరోజు అమ్మవారు మహిషాసురమర్ధిని, మహాకాళి, సిద్ధిధాత్రి రూపంలో భక్తులను అనుగ్రహించారు. ఈ క్రమంలో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని తమతమ సంప్రదాయం ప్రకారం ఆరాధించారు. అమ్మలగన్నయమ్మ అనుగ్రహం కోసం భక్తులు తమదైన శైలిలో భక్తిని చాటుకున్నారు. ఈ క్రమంలో కేరళ త్రివేండ్రంలోని శ్రీ రారాజేశ్వరి ఆలయంలో భక్తులు అగ్ని గుండంపై నుంచి నడిచారు. ఇందులో విశేషమేముంది అనుకోకండి.. ఇప్పటివరకు మనం భక్తులు నిప్పులపై నడవడం మాత్రమే చూశాం. కానీ ఇక్కడ కణకణ ఎగసిపడుతున్న అగ్ని కీలల మధ్యనుంచి భక్తులు భక్తిపారవశ్యంతో నడిచారు. బోగిమంటలా పేర్చిన కట్టెలనుంచి ఉవ్వెత్తున మంటలు ఎగసి పడుతుండగా భక్తులు ఆ మంటల మధ్యనుంచి అమ్మవారిని కీర్తిస్తూ నడిచారు. ఆ దృశ్యం చూడ్డానికి సీతమ్మవారు అగ్ని స్నానం ఆచరించిన నాటి దృశ్యాన్ని తలపించింది. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి భక్తులు ఆశ్చర్యపోయారు. తమదైనశైలిలో కామెంట్లు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్..నోరూరించే రుచులతో విమానాల్లో కొత్త మెనూ
మహిళ స్టెప్పులకు అనుగుణంగా గేదె డ్యాన్స్.. వీడియో వైరల్
ఆకాశంలో చక్కర్లు కొట్టిన డ్రాగన్ !! ఆశ్చర్య పోయిన కోట్లాదిమంది నెటిజన్లు !!
బాగా హైట్ ఉన్న ఈ పిల్లి .. గిన్నిస్ రికార్డు నెలకొల్పింది
God Father: బాలీవుడ్‌ను బెంబేలెత్తిస్తున్న చిరు గాడ్ ఫాదర్