కూలిన మెట్రో స్టేషన్‌ వాల్‌.. పలువురికి గాయాలు..

Updated on: Feb 08, 2024 | 9:15 PM

ఢిల్లీలోని గోకల్‌పురి మెట్రో స్టేషన్‌లో ‍గురువారం ప్రమాదం చోటుచేసుకుంది. మెట్రో స్టేషన్‌లోని సైడ్ వాల్‌లోని కొంత భాగం అకస్మాత్తుగా కూలిపోవడంతో, అక్కడున్నవారంతా భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనలో కొందరు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు శిథిలాల కింద చిక్కుకున్నవారికి బయటకు తీసుకువచ్చి, సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఢిల్లీ పోలీసుల వివరాలు ప్రకారం గురువారం 11 గంటల సమయంలో గోకల్‌పురి మెట్రో స్టేషన్ సరిహద్దు గోడ కూలిపోయి, దిగువ రహదారిపై పడిపోయింది.

ఢిల్లీలోని గోకల్‌పురి మెట్రో స్టేషన్‌లో ‍గురువారం ప్రమాదం చోటుచేసుకుంది. మెట్రో స్టేషన్‌లోని సైడ్ వాల్‌లోని కొంత భాగం అకస్మాత్తుగా కూలిపోవడంతో, అక్కడున్నవారంతా భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనలో కొందరు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు శిథిలాల కింద చిక్కుకున్నవారికి బయటకు తీసుకువచ్చి, సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఢిల్లీ పోలీసుల వివరాలు ప్రకారం గురువారం 11 గంటల సమయంలో గోకల్‌పురి మెట్రో స్టేషన్ సరిహద్దు గోడ కూలిపోయి, దిగువ రహదారిపై పడిపోయింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిలో ఒకరు తీవ్రంగా గాయపడగా, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. క్షతగాత్రులను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు పోలీసులు. జేసీబీ, క్రేన్‌ సహాయంతో శిధిలాలు తొలగిస్తున్నారు. స్థానిక పోలీసులు, మెట్రో ఉద్యోగులు సహాయక చర్యలలో పాల్గొన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ ఉద్యోగులకు ఫైనల్‌ వార్నింగ్‌.. ఆఫీస్‌కి వస్తారా ?? రారా ??

KFC In Ayodhya: అయోధ్యలో కేఎఫ్‌సీ..ఆ ఒక్కటీ తప్ప అన్నీ అమ్ముకోవచ్చట

కటింగ్‌ చేయించుకోమన్న డీన్‌.. ఆ విద్యార్ధి ఏంచేశాడో తెలుసా ??

ఖరీదైన మా రోలెక్స్‌ వాచ్‌లను కొట్టేస్తున్నారు.. లండన్‌లో భారత సీఈవోల ఆందోళన

క్యాన్సర్‌తో కుడిచేయి తీసేసినా.. 2 నెలల్లో ఎడమ చేతితో పరీక్షకు సిద్ధం