ఆ ఉద్యోగులకు ఫైనల్ వార్నింగ్.. ఆఫీస్‌కి వస్తారా ?? రారా ??
మార్చి చివరికల్లా ఆఫీస్‌కు వచ్చి పని చేయాలని, లేదంటే తీవ్ర పరిణామా ఎదుర్కొంటారని... వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న ఉద్యోగులను దేశీయ ఐటీ దిగ్గజం TCS హెచ్చరించింది. ఈ మేరకు కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎన్‌జీ సుబ్రహ్మణ్యం ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడారు. ఆఫీస్‌కు వచ్చి పనిచేసేందుకు ఉద్యోగులకు ఇచ్చిన గడువును మరోసారి పొడిగించామని, గడువు తేదీ వివరాలను తమ ఉద్యోగులకు తెలియజేశామని వెల్లడించారు.
మార్చి చివరికల్లా ఆఫీస్‌కు వచ్చి పని చేయాలని, లేదంటే తీవ్ర పరిణామా ఎదుర్కొంటారని… వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న ఉద్యోగులను దేశీయ ఐటీ దిగ్గజం TCS హెచ్చరించింది. ఈ మేరకు కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎన్‌జీ సుబ్రహ్మణ్యం ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడారు. ఆఫీస్‌కు వచ్చి పనిచేసేందుకు ఉద్యోగులకు ఇచ్చిన గడువును మరోసారి పొడిగించామని, గడువు తేదీ వివరాలను తమ ఉద్యోగులకు తెలియజేశామని వెల్లడించారు. ప్రస్తుతానికి 65 శాతం మంది ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీస్‌కి వచ్చి పనిచేస్తున్నారని వెల్లడించారు. కొవిడ్‌కు ముందు ఉన్న వర్క్ మోడల్ను తిరిగి ప్రవేశపెట్టాలని TCS యోచిస్తోందని ఆయన చెప్పారు. ఇంటి నుంచి పనిచేయడం వల్ల అటు ఉద్యోగులకు, ఇటు కంపెనీకి సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు. ఉద్యోగులను ఆఫీసుకు రప్పించడం వెనక భద్రతా కారణాలు ఉన్నాయని, సైబర్ దాడుల ముప్పు పొంచి ఉందని సుబ్రహ్మణ్యం ఆందోళన వ్యక్తం చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
KFC In Ayodhya: అయోధ్యలో కేఎఫ్‌సీ..ఆ ఒక్కటీ తప్ప అన్నీ అమ్ముకోవచ్చట
కటింగ్ చేయించుకోమన్న డీన్.. ఆ విద్యార్ధి ఏంచేశాడో తెలుసా ??
ఖరీదైన మా రోలెక్స్ వాచ్‌లను కొట్టేస్తున్నారు.. లండన్‌లో భారత సీఈవోల ఆందోళన
క్యాన్సర్‌తో కుడిచేయి తీసేసినా.. 2 నెలల్లో ఎడమ చేతితో పరీక్షకు సిద్ధం
ఆరోగ్య మంత్రిత్వ శాఖ బ్రాండ్ అంబాసిడర్‌గా పూనమ్ పాండే..? క్లారిటీ ఇచ్చిన కేంద్రం