Hornbill bird: ప్రేమంటే ఇదేరా..! అందమైన హార్నబిల్ జంట.. ఒక్క పక్షితో మాత్రమే జతకట్టే హార్నబిల్ లక్షణం
ప్రేమానుబంధాలు, ఆప్యాయతలు.. మనుషులకే కాదు. జంతువులు, పక్షుల మధ్య కూడా ఉంటాయి. అందుకు చక్కని ఉదాహరణగా నిలుస్తోంది "హార్న్‌బిల్" అనే ఓ అరుదైన పక్షి.
ప్రేమానుబంధాలు, ఆప్యాయతలు.. మనుషులకే కాదు. జంతువులు, పక్షుల మధ్య కూడా ఉంటాయి. అందుకు చక్కని ఉదాహరణగా నిలుస్తోంది “హార్న్‌బిల్” అనే ఓ అరుదైన పక్షి. అద్భుతమైన, విలక్షణమైన రూపంతో అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. వర్షారణ్యాల్లో ఉండే ఈ పక్షి.. అందమైన రెక్కలతో, ఆకాశంలో విహరిస్తుంటే భలేగా కనిపిస్తుంది. మెడ, తోక.. తెలుపు, ముఖం, రెక్కలు.. నలుపు రంగులో ఉంటాయి. రెక్కలపై ఉండే తెలుపు చారలు ఎగిరేటప్పుడు మెరుస్తాయి. మనదేశంలో హార్న్‌బిల్ పక్షులు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. ఇకపోతే, ఇంత అందమైన హార్న్‌బిల్ పక్షుల్లో మరో ప్రత్యేకమైన లక్షణం ఉంది..ఇవి వాటి జంటను ఎప్పుడూ విడిపోవు. ఒక పక్షి మరో పక్షితో మాత్రమే కలిసి ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ పక్షులతో జతకట్టదు. పైగా ఆడపక్షికి కావాల్సిన ఆహారం, గూడు సమకూర్చే బాధ్యత కూడా మగపక్షికే ఉంటుంది. చెట్లలో సహజంగా ఉండే తొర్రలనే ఇవి గూడుగా భావిస్తాయి. లేదంటే ఇతర పక్షుల గూళ్లను ఆక్రమించేస్తాయి..ఆడ హార్న్‌బిల్ పక్షి…ఆ గూడు లోపలికి వెళ్లి… లోపలి నుంచి తనను తాను బంధించుకున్నట్టుగా లోపలి నుంచి గూడును మూసివేస్తుంది. సన్న కన్నం మాత్రమే ఉండేలా చేసుకుంటుంది… ఆ కన్నం ద్వారా… మగ పక్షి తెచ్చే ఆహారాన్ని తింటుంది. అలా ఆ పక్షి 3, 4 నెలలు… గూడు లోపలే ఉంటూ గుడ్లు పెట్టి పొదుగుతుంది. ఇక పిల్లలు పుట్టాక తండ్రిగా మగ హార్నబిల్ పక్షి మరింత ఎక్కువ ఆహారం తెచ్చిపెడుతుంది ఆ తల్లి,బిడ్డలకు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urfi Javed-Samantha: సమంత చూపిస్తే అందం.. నేను చూపిస్తే అసహ్యమా.. శృంగార తార షాకింగ్ కామెంట్స్..
Viral Video: భార్య శవంతో 21 ఏళ్లుగా సహాజీవనం.. చివరకు..! వీడియో చుస్తే హృదయం కదలాల్సిందే..!
Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..