cow attack: కర్మ ఫలం అంటే ఇదే బాస్.. ఎవరూ తప్పించుకోలేరు.! ఆవా , మజాకా..(వీడియో)
మంచైనా, చెడైనా చేసిన పనికి ఫలితం అనుభవించే తీరాలి. దానినే కర్మ ఫలం అంటారు. సరిగ్గా అలాంటి సంఘటనే ఇక్కడ జరిగింది. అతను చేసిన పనికి వెంటనే కర్మఫలం అనుభవించాడు. నిర్దాక్షిణ్యంగా మూగ జీవిని హింసించాడు.
ఇంటర్నెట్‌లో ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వీధిలో ఇద్దరు వ్యక్తులు ఓ ఆవును ఎక్కడికో తోలుకెళ్తున్నారు. ఆవు మెడలో ఓ తాడు కట్టిఉంది. దానిని పట్టుకొని ముందు ఒక వ్యక్తి నడుస్తుంటే అతని వెంటే నడుస్తుంది ఆవు. దాని వెనుక మరో వ్యక్తి కర్ర పట్టుకుని ఆవును అదిలిస్తూ నడుస్తున్నాడు. ఏమైందో ఓ చోటకు వచ్చేసరికి ఆవు అక్కడ ఆగింది. దాంతో వెనుక కర్రపట్టుకుని వస్తున్న వ్యక్తి దానిని కొట్టాడు. కాలితో తన్నాడు. అంతేకాదు దాని తోకపట్టుకొని గట్టిగా మెలితిప్పుడూ హింసించాడు. దాంతో సహనం కోల్పోయిన ఆ ఆవు వెంటనే అతనిపై తిరగబడింది. కిందపడేసి కుమ్మేసింది. ఆవు ఆగ్రహానికి ముందు తాడుపట్టుకున్న వ్యక్తికూడా భయంతో తాడును వదిలేసాడు. దాంతో తనను కొట్టిన వ్యక్తికి బుద్ధి చెప్పింది ఆవు. ఈ సంఘటన నెట్టింట వైరల్‌గా మారింది. ఆవుపట్ల ఆ వ్యక్తి తీరుకు నెటిజన్లు మండిపడుతున్నారు. సాధు జంతువును హింసిస్తే కర్మఫలం అలాగే ఉంటుందంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Bad Memories: ఇక నుండి బాధాకర జ్ఞాపకాలను మర్చిపోవడం సాధ్యమే.! ఎలా అంటే..
Shocking news: అరుదైన ఘటన.. గర్భిణి అని తెలుసుకున్న 48 గంటల్లో డెలివరీ..
రోడ్లు బాగు చేయాలంటూ రోడ్డుపై పొర్లు దండాలు
దూసుకెళ్తున్న ఎమ్మెల్యే కారు... ఆపిన పోలీసులు.. ఆ తర్వాత
విషాదం అంటే ఇదే... ఆ దాత నుంచి కిడ్నీ తీసుకున్న వారాలకే
‘దురంధర్’ పాటకు పాక్లో దుమ్మురేపేలా డాన్స్
గబ్బిలాలకు పూజలు చేసే గ్రామం.. ఎందుకో తెలుసా ??
200 ఏళ్ల నాటి అరుదైన శంఖం... ఏడాదికి ఒక్కసారే...
ప్రియుడి భార్య ఎంట్రీ..10వ అంతస్తు లో వేలాడిన ప్రియురాలు

