Late Love: లేటు వయసులో ఘాటు ప్రేమ.. ఒక్కటైన వృద్ధ జంట.. వీడియో.
ప్రేమకు వయసుతో పనేముంది.. ప్రేమించే హృదయం ఉండాలే కానీ ప్రేమ ఏ వయసు వారిలోనైనా చిగురులు తొడుగుతుంది. 70ఏళ్ల వయసులో ఓ జంట పెళ్లి పీటలు ఎక్కింది. 75ఏళ్ల బాబూరావు పాటిల్ , 70 ఏళ్ల అనసుయ షిండే రెండేళ్ల
ప్రేమకు వయసుతో పనేముంది.. ప్రేమించే హృదయం ఉండాలే కానీ ప్రేమ ఏ వయసు వారిలోనైనా చిగురులు తొడుగుతుంది. 70ఏళ్ల వయసులో ఓ జంట పెళ్లి పీటలు ఎక్కింది. 75ఏళ్ల బాబూరావు పాటిల్ , 70 ఏళ్ల అనసుయ షిండే రెండేళ్ల నుంచి మహరాష్ట్ర కొల్హాపూర్ జిల్లాలోని జానకి వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. వృద్ధాశ్రమంలో అడుగుపెట్టే నాటికే బాబూరావు భార్యను కోల్పోయాడు. అనుసయ కూడా భర్తను కోల్పోయింది. ఇద్దరికీ అక్కడే పరిచయం ఏర్పడింది. కన్నబిడ్డల ఆదరణకు గురై వృద్ధాశ్రమంలో ఉంటున్నవారు ఒకరికి ఒకరు తోడయ్యారు. కష్టసుఖాలు పంచుకున్నారు. ఈ క్రమంలో ఆ వృద్ధజంట ప్రేమికులుగా మారారు. బాబూరావు పాటిల్ కొద్దిరోజుల క్రితం అనసుయకు పెళ్లి ప్రపోజ్ చేశాడు. అయితే, ఆమె మొదట అంగీకరించలేదు. వారం రోజులు ఆలోచించిన తరువాత, ఆమె అతని ప్రతిపాదనను అంగీకరించింది. జానకి ఆశ్రమంలోని వారు ఆ ప్రేమికులకు పెళ్లి చేసి తమ ముచ్చట తీర్చుకున్నారు. హృదయాన్ని కదిలించే వీరి కథ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్స్ ఈ జంటను ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు అందజేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Naatu Naatu Song in Oscar 2023: వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్ ఫీవర్.. ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా..
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

