AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral video: ఒకే కుటుంబంలో నలుగురికి 6 చిన్న ఇళ్లు..!  ఆదర్శ కుటుంబం ఎందుకంటే..

Viral video: ఒకే కుటుంబంలో నలుగురికి 6 చిన్న ఇళ్లు..! ఆదర్శ కుటుంబం ఎందుకంటే..

Anil kumar poka
|

Updated on: Mar 13, 2023 | 8:51 AM

Share

అమెరికాలో ఓ కుటుంబం ఓ గ్రామాన్నే ఇంటిగా మార్చుకొని కలిసిమెలిసి ఉంటున్నారు. కుటుంబంలో ఉండేది నలుగురే అయినా.. ఎవరి ఇల్లు వారిదే. తల్లిదండ్రులకు ఒకటి, పిల్లలకు ఒక్కోటి, అందరు కలిసి ఉండేందుకు మరోటి..

అమెరికాలో ఓ కుటుంబం ఓ గ్రామాన్నే ఇంటిగా మార్చుకొని కలిసిమెలిసి ఉంటున్నారు. కుటుంబంలో ఉండేది నలుగురే అయినా.. ఎవరి ఇల్లు వారిదే. తల్లిదండ్రులకు ఒకటి, పిల్లలకు ఒక్కోటి, అందరు కలిసి ఉండేందుకు మరోటి.. ఇలా చిన్న చిన్న ఇళ్లతో ఏకంగా ఓ గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సుస్థిరమైన జీవన విధానాన్ని ఇతరులకి తెలియజేయడానికి వారు ప్రత్యేకంగా ఇలా జీవిస్తున్నారు.ఉరుకుల పరుగుల ప్రపంచానికి దూరంగా.. చక్కని వాతావరణంలో.. కెలి, రియాన్ బ్రింకెన్ కుటుంబం తమ ఇద్దరు టీనేజ్​ పిల్లలతో కలిసి .. కెంటకీలోని లండన్​లో 6 చిన్న ఇళ్లను ఏర్పాటు చేసుకున్నారు. 2015లోనే 21ఎకరాల భూమిని.. కేవలం 57వేల డాలర్లకు కొనుగోలు చేసారు.కుటుంబం అంతా కలిసి ఆనందంగా గడపటానకి ఒక పూల్ హౌస్​ను ఏర్పాటు చేసుకున్నారు. కేలీ మాట్లాడుతూ, ‘కుటుంబం అంతా వేర్వేరు ఇళ్లలో నివసించడం వింతగా ఉండొచ్చు. కానీ వ్యక్తిగత గోప్యత పరంగా ఇది బాగుంటుంద’ని వారు తెలిపారు. ‘చిన్న ఇళ్లు ఉండటం వల్ల ఇంట్లో చెత్త తక్కువగా ఉంటుంది. వారానికి ఒక చెత్త బ్యాగ్ మాత్రమే బయట వేస్తాం. ‘RRRR​’ రిఫ్యూస్, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ సూత్రాన్ని పాటిస్తాం. ప్లాస్టిక్ బ్యాగ్‌లు వాడం. ఆహార వ్యర్థాల్ని ఎప్పటికప్పుడు ఎరువులుగా మారుస్తాం. రీసైకిల్ అయ్యే వస్తువులన్నింటినీ మళ్లీ ఉపయోగిస్తుంటాం. చాలా అరుదుగా బట్టల్ని ఆరబెట్టడానికి డ్రయ్యర్లను ఉపయోగిస్తాం’ అని చెప్పారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Naatu Naatu Song in Oscar 2023: వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్‌ ఫీవర్‌.. ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా..

Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్‌ ఇచ్చిన బన్నీ.. వీడియో.

Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!

Published on: Mar 13, 2023 08:51 AM