Monkey: కోతిని పట్టుకుంటే రూ.500.. పట్టుకోండి చూద్దాం.. వీడియో.
కాకినాడ జిల్లాలోని కొన్ని గ్రామాల్లో కోతుల బెడద ఎక్కువై పోయింది. పంటపొలాలు, కొబ్బరి చెట్లు, మామిడి తోటల్లో పంటను నాశనం చేస్తున్నాయంటూ రైతులు గగ్గోలు పెడుతున్నారు.
కాకినాడ జిల్లాలోని కొన్ని గ్రామాల్లో కోతుల బెడద ఎక్కువై పోయింది. పంటపొలాలు, కొబ్బరి చెట్లు, మామిడి తోటల్లో పంటను నాశనం చేస్తున్నాయంటూ రైతులు గగ్గోలు పెడుతున్నారు. కొన్ని సార్లు మనుషులపైనా దాడి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో గ్రామ సర్పంచ్‌లు, గ్రామ పంచాయితీ అధికారులకు తమ గోడు విన్నవించుకున్నారు. దీంతో కోతుల బెడదకు చెక్ పెట్టాలని భావించిన ఆయాగ్రామాల సర్పంచ్‌లు వినూత్నంగా ఆలోచించారు. కోతిని పట్టుకుంటే ఒక్కో కోతికి 500 రూపాయలు ఇస్తానని ప్రకటించారు.దాంతో రంగంలోకి దిగిన మంకీ క్యాచర్ టీం కోతుల పనిపట్టే కార్యక్రమం చేపట్టారు. కోతులను పట్టుకునేందుకు ప్రత్యేక బోనులు, ఉచ్చులు ఏర్పాటు చేసి అందులో ఆహారం ఎరగా వేశారు. దాంతో నాలుగు రోజుల్లోనే వందల కోతులు బోనులో చిక్కుకున్నాయి. వాటిని సురక్షితంగా తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. మంకీ క్యాచర్ మాట్లాడుతూ వాటికి ఆహారం, నీరు అన్నీ అందుబాటులో ఉన్న ప్రాంతంలోనే విడిచిపెడతామని తెలిపారు. కోతులనుంచి తమ పంటలను, పిల్లలను కాపాడినందుకు గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Naatu Naatu Song in Oscar 2023: వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్ ఫీవర్.. ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా..
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

