పాన్‌కార్డ్‌తో ఇలా కూడా మోసం చేయొచ్చా ?? విద్యార్థికి రూ. 46 కోట్ల కుచ్చుటోపీ

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ కు చెందిన ఓ విద్యార్థికి ఆదాయ పన్ను, జీఎస్టీ అధికారులు ట్యాక్స్ నోటీసులు పంపించారు. 46 కోట్ల రూపాయల లావాదేవీలపై పన్నులు చెల్లించాలని నోటీసులో ఉంది. ఇది చూసి విద్యార్థి షాకయ్యాడు. తన పేరు ప్రమోద్ కుమార్ దండోటియా అని ఈ లావాదేవీలకు, తనకు ఎలాంటి సంబంధం లేదని శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన పాన్‌కార్డ్‌తో ఒక కంపెనీ రిజిస్టర్ చేసి ఉందని, పన్ను చెల్లించాలంటూ ఆదాయపు పన్ను, జీఎస్టీ విభాగం నుంచి ట్యాక్స్ నోటీసులు వచ్చాయని యువకుడు వాపోయాడు.

పాన్‌కార్డ్‌తో ఇలా కూడా మోసం చేయొచ్చా ?? విద్యార్థికి రూ. 46 కోట్ల కుచ్చుటోపీ

|

Updated on: Apr 01, 2024 | 9:06 PM

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ కు చెందిన ఓ విద్యార్థికి ఆదాయ పన్ను, జీఎస్టీ అధికారులు ట్యాక్స్ నోటీసులు పంపించారు. 46 కోట్ల రూపాయల లావాదేవీలపై పన్నులు చెల్లించాలని నోటీసులో ఉంది. ఇది చూసి విద్యార్థి షాకయ్యాడు. తన పేరు ప్రమోద్ కుమార్ దండోటియా అని ఈ లావాదేవీలకు, తనకు ఎలాంటి సంబంధం లేదని శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన పాన్‌కార్డ్‌తో ఒక కంపెనీ రిజిస్టర్ చేసి ఉందని, పన్ను చెల్లించాలంటూ ఆదాయపు పన్ను, జీఎస్టీ విభాగం నుంచి ట్యాక్స్ నోటీసులు వచ్చాయని యువకుడు వాపోయాడు. ముంబై, ఢిల్లీ నగరాల్లో 2021లో ఈ కంపెనీలను నిర్వహించారని అందులో పేర్కొన్నారని వివరించాడు. తాను గ్వాలియర్‌లో ఓ కాలేజీ విద్యార్థినని, పాన్‌కార్డు ఏ విధంగా దుర్వినియోగం అయిందో తెలియదని, లావాదేవీలు ఏ విధంగా జరిగాయో తెలియదని చెప్పాడు. ఆదాయపు పన్ను శాఖ నుంచి సమాచారం అందిన వెంటనే సంబంధిత శాఖ అధికారులను సంప్రదించానని అన్నాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇండియన్ నేవీ 23 మంది పాకిస్థానీలను ఎందుకు రక్షించింది ??

గ్యాంగ్ స్టర్‌ ఇంటర్వ్యూ అని వెళ్లి కిడ్నాపైన యూట్యూబర్

12 నెలల్లో రూ.7.3 లక్షలకు ఇడ్లీలు ఆర్డర్ .. హైదరాబాద్ వ్యక్తి రికార్డు

Follow us