ఇండియన్ నేవీ 23 మంది పాకిస్థానీలను ఎందుకు రక్షించింది ??

అరేబియా సముద్రంలో సముద్రపు దొంగల దాడి నుంచి 23 మంది పాకిస్థానీలను భారత నేవీ రక్షించింది. మార్చి 28న ఇరాన్‌కు చెందిన ఓ చేపల బోటుపై సముద్రపు దొంగలు దాడి చేశారని తెలియడంతో రంగంలోకి దిగిన భారత నేవీ 12 గంటల పాటు శ్రమించి దొంగలను అదుపులోకి తీసుకుంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. దాడి గురించి తెలియగానే రెండు యుద్ధ నౌకలను అక్కడికి పంపించినట్లు నేవీ తెలిపింది.

ఇండియన్ నేవీ 23 మంది పాకిస్థానీలను ఎందుకు రక్షించింది ??

|

Updated on: Apr 01, 2024 | 9:05 PM

అరేబియా సముద్రంలో సముద్రపు దొంగల దాడి నుంచి 23 మంది పాకిస్థానీలను భారత నేవీ రక్షించింది. మార్చి 28న ఇరాన్‌కు చెందిన ఓ చేపల బోటుపై సముద్రపు దొంగలు దాడి చేశారని తెలియడంతో రంగంలోకి దిగిన భారత నేవీ 12 గంటల పాటు శ్రమించి దొంగలను అదుపులోకి తీసుకుంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. దాడి గురించి తెలియగానే రెండు యుద్ధ నౌకలను అక్కడికి పంపించినట్లు నేవీ తెలిపింది. 12 గంటల పాటు శ్రమించి నావపై ఉన్న నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పింది. పడవలోని 23 మంది పాకిస్థానీ సిబ్బందిని రక్షించినట్టు వెల్లడించింది. అనంతరం, నావను క్షుణ్ణంగా తనిఖీ చేసి వదిలిపెట్టినట్లు పేర్కొంది. సోకోట్రా తీరానికి నైరుతి దిక్కున 90 నాటికల్ మైళ్ల దూరంలో దొంగలు ఆ నావపై దాడి చేశారు. తమను రక్షించాలంటూ సిబ్బంది అభ్యర్థించగానే భారత నేవీ రంగంలోకి దిగింది. తొలుత యుద్ధ నౌక ఐఎన్ఎస్ సుమేధ.. దొంగలు హైజాక్ చేసిన నావను అడ్డగించింది. ఆ తరువాత.. సుమేధకు తోడుగా ఐఎన్ఎస్ త్రిశూల్‌ కూడా రంగంలోకి దిగింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గ్యాంగ్ స్టర్‌ ఇంటర్వ్యూ అని వెళ్లి కిడ్నాపైన యూట్యూబర్

12 నెలల్లో రూ.7.3 లక్షలకు ఇడ్లీలు ఆర్డర్ .. హైదరాబాద్ వ్యక్తి రికార్డు

Follow us
Latest Articles
ఈ హాట్ బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
ఈ హాట్ బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
నల్లని, మెరిసే ఒత్తైన జుట్టు కోసం కలబందను ఇలా ఉపయోగించాలి
నల్లని, మెరిసే ఒత్తైన జుట్టు కోసం కలబందను ఇలా ఉపయోగించాలి
లక్నోతో మ్యాచ్.. టాస్ ఓడిన ముంబై.. డేంజరస్ బౌలర్ల రీఎంట్రీ
లక్నోతో మ్యాచ్.. టాస్ ఓడిన ముంబై.. డేంజరస్ బౌలర్ల రీఎంట్రీ
నాలుగో అంతస్తునుంచి జారిపడిన నెలల చిన్నారి.. ఎలాకాపాడారో చూడండి
నాలుగో అంతస్తునుంచి జారిపడిన నెలల చిన్నారి.. ఎలాకాపాడారో చూడండి
కాలేశ్వరం డ్యామేజ్ కు కారణం మీకు తెలుసా..?
కాలేశ్వరం డ్యామేజ్ కు కారణం మీకు తెలుసా..?
ఈ కుర్రాడిని గుర్తు పట్టారా? క్రికెట్‌లో రికార్డుల రారాజు.
ఈ కుర్రాడిని గుర్తు పట్టారా? క్రికెట్‌లో రికార్డుల రారాజు.
ఈడో సుప్పిని సుద్దపుసని.. ఇంగ్లీష్ పేపర్‌లో ఏం రాశాడో చూస్తే.!
ఈడో సుప్పిని సుద్దపుసని.. ఇంగ్లీష్ పేపర్‌లో ఏం రాశాడో చూస్తే.!
అందుకే మోదీ ఫొటో పెట్టలేదు.. కూటమి మేనిఫెస్టోపై సీఎం జగన్‌..
అందుకే మోదీ ఫొటో పెట్టలేదు.. కూటమి మేనిఫెస్టోపై సీఎం జగన్‌..
స్టూడెంట్ కోసం యూనివర్సిటీ బంపర్ ఆఫర్...నో సమ్మర్ హాలిడేస్
స్టూడెంట్ కోసం యూనివర్సిటీ బంపర్ ఆఫర్...నో సమ్మర్ హాలిడేస్
ఎన్నికల ప్రచారానికి హీరో వెంకటేష్.. ఖమ్మంలో ఆ పార్టీకి మద్దతుగా..
ఎన్నికల ప్రచారానికి హీరో వెంకటేష్.. ఖమ్మంలో ఆ పార్టీకి మద్దతుగా..